కర్కాటక రాశిలో సూర్యుడు..
గ్రహాలు నిర్ధిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులవారికి శుభ పరిణామాలు ఎదురైతే, మరికొన్ని రాశులవారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. జ్యోతిష్యం ప్రకారం అన్ని గ్రహాలకు రాజు సూర్యుడు. ఏ రాశిలోకి సంచారం చేసినా సూర్యుడు నెలరోజులే ఉంటాడు. ఈ ఏడాది జులై 16వ తేదీన సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఆగస్టు 15వ తేదీ వరకు ఉంటాడు. దీనివల్ల మూడు రాశులవారికి ఆర్థిక లాభాలు కలగనున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
సింహరాశి
వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడులకు సంబంధించి గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. దీనివల్ల ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. లేదంటే దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడతారు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. విద్యార్థులకు మంచి లాభాలు కలుగుతాయి. చదువుపై ఏకాగ్రత కుదురుతుంది. పని ఒత్తిడి తగ్గుతుంది.

వృశ్చికరాశి
వీరికి అంతా శుభప్రదంగా ఉంటుంది. కెరీర్ కు సంబంధించి మార్పులు చోటుచేసుకుంటాయి. ఎలాంటి పనులు తలపెట్టినా విజయం సాధిస్తారు. వ్యాపారాలు చేయాలనుకునేవారు మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చిన్న చిన్న ప్రయాణాలుంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
మీనరాశి
వ్యాపారాల్లో లాభాలున్నాయి. ఆర్థికంగా మెరుగుపడతారు. విద్యార్థులకు ధనలాభం ఉంది. అయితే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఒత్తిడి పెరిగి అనారోగ్యం కలుగుతుంది. స్నేహితుల నుంచి అవసరమైనప్పుడు సలహాలు తీసుకుంటే ఉపయోగపడతాయి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు తగ్గుతాయి. అనుబంధం బలోపేతమవుతుంది.












Click it and Unblock the Notifications