ఈనెల 30 నుంచి నవంబరు 15 వరకు ఈ రాశులకు అఖండ ధనయోగం
జ్యోతిష్యం ప్రకారం శని దేవుడు కర్మలకు అధిపతి. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ఈనెల 30వ తేదీన శని వ్యతిరేక దిశలో కదులుతాడు. ఈ కదలిక నవంబరు 15 వరకు ఉంటుంది. ఇలా శనిదేవుడు వ్యతిరేక దిశలో కదలడంవల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. జాతకంలో శని శుభస్థానంలో ఉంటే నవంబరు 15 వరకు అనేకరకాల ప్రయోజనాలు కదులుతాయి. జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
తులారాశి
రాబోయే ఐదు నెలలు వీరికి చాలా బాగుంటుంది. అనేక ప్రయోజనాలను పొందుతారు. ఎటువంటి పనులు చేసినా విజయాలు సాధిస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. కీలమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవడం మంచిది. వ్యాపారాలు చేస్తున్నవారు పెట్టుబడులవల్ల మంచి లాభాలను పొందుతారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కష్టాలన్నీ తొలగిపోతాయి.

వృశ్చిక రాశి
ఒత్తిడి తగ్గి మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. పారిశ్రామికవేత్తలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల వల్ల భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. ఊహించనిరీతిలో ధనలాభం ఉంటుంది. ప్రేమ జీవితం కొనసాగిస్తున్నవారికి కలిసివస్తుంది. కెరీర్ కు సంబంధించి అనేక ప్రయోజనాలున్నాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు పొంది ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఆర్థికంగా బలోపేతమవుతారు.
కన్యారాశి
అన్నీ సానుకూల మార్పులే చోటుచేసుకుంటాయి. ఆర్థికంగా లాభాలున్నాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే అనారోగ్యానికి గురవుతారు. ఎటువంటి పనులు చేసినా శుభవార్తలే వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. శనిదేవుడి అనుగ్రహం వల్ల అనేక లాభాలున్నాయి. అదృష్టం తోడుంటుంది. విజయాలు సాధిస్తారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.












Click it and Unblock the Notifications