10 ఏళ్ల తర్వాత త్రికోణ రాజయోగం.. ఈరాశులు నక్కతోక తొక్కినట్లే
జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి కాలానుగుణంగా సంచరిస్తుంటాయి. సంపదకు, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల కొన్ని శుభయోగాలు ఏర్పడతాయి. మాళవ్య యోగంతోపాటు త్రికోణ రాజయోగం కూడా ఏర్పడుతుంది. వీటివల్ల ఏప్రిల్ నెల మొత్తం కొన్ని రాశులవారికి ధనలాభం కలిగిస్తుంది. దీంతోపాటు మరెన్నో ప్రయోజనాలు కూడా కలగనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
మిథున రాశి
చేసే పనితోపాటు వ్యాపారాల్లో కూడా విజయం సాధిస్తారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగవుతుంది. కెరీర్ లో మంచి పురోగతి ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ ప్రణాళిక ప్రకారం పూర్తిచేస్తారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. భవిష్యత్తులో మంచి లాభాలుంటాయి. తండ్రితో అనుబంధం బలపడుతుంది.

కర్కాటక రాశి
త్రికోణ రాజయోగం ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. చేసే పనుల్లో విజయం సాధించడంతోపాటు పెండింగ్ పనులు కూడా పూర్తిచేస్తారు. వ్యాపారాలవల్ల ప్రయాణాలు చేస్తారు. దీనివల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి. విద్యార్థులు పోటీల్లో పాల్గొంటారు.
కన్య రాశి
ఈ రాశి ఏడో స్థానంలో మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, వైవాహిక జీవితంలో ఉన్నవారికి మంచి ప్రయోజనాలున్నాయి. కార్యాలయంలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలున్నాయి.
ధనస్సు రాశి
సంతోషంగా ఉంటారు. కొత్త వాహనం లేదంటే ఇంటిని కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయాల్లో పదవులు లభిస్తాయి. కుటుంబం నుంచి, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది.
కుంభ రాశి
ఆర్థికంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ఈ సమయంలో ఆకస్మిక సంపదను పొందుతారు. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. శుక్రుడి రాజయోగంతో ఆదాయం పెరుగుతుంది.












Click it and Unblock the Notifications