ఈ రాశులకు కొత్త ఏడాదిలో అపారమైన సంపద.. కారణం శుక్రుడు
నవగ్రహాల్లో శుక్రుడు కీలక గ్రహం. రాక్షసులకు గురువు, సంపదను, కళలను, ప్రేమ, శ్రేయస్సుకు, విలాసవంతమైన జీవితానికి కారకుడు. శుక్రుడు ప్రతి నెలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. అలాగే మార్చి రెండో తేదీన మీనరాశిలోకి, మార్చి 26వ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటున్నప్పటికీ 6 రాశులమీద మాత్రం అధిక ప్రభావం ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. లాభపడే రాశుల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
ధనుస్సు రాశి
అపారమైన సంపద చేతికి అందుతుంది. కొత్తగా వాహనాన్ని కొంటారు. పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం వస్తుంది. ఆకస్మికంగా ఆర్థిక లాభం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఇరువైపులా మద్దతు లభిస్తుంది. ఇల్లు లేదంటే భూమిని కొంటారు. దాంతప్య జీవితంలో సమస్యలన్నీ ముగిసిపోతాయి.

మిథున రాశి
తోబుట్టువులు మీకు అడుగడుగునా మద్దతుగా నిలుస్తారు. శుక్రుడి నుంచి ప్రత్యేకమైన ఆశీస్సులు అందుతాయి. అపారమైన సంపదకు ఈ రాశివారు యజమాని అవుతారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. వ్యాపారంలో ఆర్థికంగా మంచి లాభాలను అందుకుంటారు.
కన్యా రాశి
పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. లక్ష్మీదేవి ఇంట్లోనే కొలువై ఉంటుంది. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత వెల్లివిరుస్తాయి. అనుకోకుండా ధనలాభం కలిగి జీవితాన్ని మార్చేస్తుంది.
వృశ్చిక రాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం వస్తుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. రుణాల నుంచి బయటపడతారు. జీవితం మహరాజులా గడుస్తుంది. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. శుక్రుడు ఈ రాశివారిని ధనవంతులుగా చేస్తున్నాడు.
కర్కాటక రాశి
జీవితంలో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. తల్లిదండ్రులకున్న చిరకాల కోరికను నెరవేరుస్తారు. వృత్తిపరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
మేష రాశి
కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది. శుక్రుడు ఈ రాశివారిని ప్రతి దశలోను ఆదుకుంటాడు. వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.












Click it and Unblock the Notifications