ఈ రాశులవారికి డబ్బు వాసనను పసిగట్టి చెప్పే పారిజాత యోగం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించే సమయంలో కొన్ని రాశులకు శుభ పరిణామాలు కలిగితే మరికొన్ని రాశులకు అశుభ పరిణామాలు కలుగుతాయి. జాతక చక్రం ప్రకారం ఏర్పడే కొన్ని యోగాల వల్ల వ్యక్తి జీవితంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. రాశి చక్రానికి చెందిన అధిపతి తన సొంత రాశిలో ఉన్నప్పుడు పారిజాత యోగం ఏర్పడుతుంది. వ్యక్తిని ఈ యోగం సాధారణ స్థితి నుంచి అసాధారణ స్థితికి తీసుకువెళుతుంది. మనిషి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు.
మేషరాశి
జీవితంలో ఇప్పటివరకు చూడని డబ్బులను ఈ సమయంలో మేషరాశివారు చూస్తారు. గతంలో వదిలేసుకున్న డబ్బులు కూడా ఇప్పుడు మీ దగ్గరకు చేరతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులందరి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. డబ్బులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

తుల
పారిజాత యోగం తులారాశివారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. జీవితంలో కీలక మలుపు తిరిగే పరిణామం చోటుచేసుకుంటుంది. త్వరలోనే ఉన్నత పదవులను అధిరోహిస్తారు. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. గతంలో రాదనుకున్న, వదిలేసిన డబ్బు చేతికి అందుతుంది.
మిథునరాశి
విద్యారంగంలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలను ఆర్జించడానికి ఇది మంచి సమయం. ఆన్ లైన్, ఇతర బెట్టింగ్ లో డబ్బులు పెట్టడం తప్పు అయినప్పటికీ అలాంటివారికి ఇప్పుడు కలిసివస్తుందని చెప్పొచ్చు. కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
కర్కాటకరాశి
న్యాయపరమైన విషయాల్లో విజయం చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులందరితో కలిసి మెలిసి జీవిస్తారు. పొరపొచ్చాలన్నీ వీడిపోతాయి. సోదరులతో ఉన్న గొడవలు సద్దుమణిగి అందరూ కలిసిపోతారు. ఈ సమయంలో ఏ పని తలపెట్టినా విజయంతో పూర్తవుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications