ఈనెల 12 నుంచి ఈ రాశులకు అన్నీ ఆర్థిక ఇబ్బందులే
వ్యక్తిగత జాతకంలో కుజుడు బలంగా ఉంటే ప్రతి పనిలో విజయం పలకరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. అదే బలహీనంగా ఉంటే సమస్యలు చుట్టుముడతాయి. ప్రతి 45 రోజులకు ఓసారి రాశిని మార్చే కుజుడిని జ్యోతిష్య పండితులు మండే గ్రహంగా పిలుస్తారు.
పరాక్రమానికి, శౌర్యానికి, శక్తికి, ధైర్యానికి అంగారకుడు కారకుడు. నక్షత్ర రాశిని మార్చినప్పుడల్లా బాగా లోతైన ప్రభావం చూపుతుంది. ఈనెల 12న కుజుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్లి ఆగస్టు 26 వరకు అక్కడే ఉంటాడు. కుజుడి సంచారం వల్ల ఏయే రాశులవారికి ఏ విధంగా కష్టాలు చుట్టుముడతాయో తెలుసుకుందాం.

మిథున రాశి
ఈ రాశివారు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మానసిక ఒత్తిడి పెరగడంతోపాటు ఖర్చులు అధికంగా ఉండటంతో మనసు కలతపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీ ప్రత్యర్థులు కూడా చురుగ్గా ఉంటారు. కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యులతో వివాదాలు వద్దు. కెరీర్ కు సంబంధించి ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కర్కాటక రాశి
కార్యాలయంలో తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా నష్టపోవడంవల్ల డబ్బుకు సంబంధించిన విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు. వాహనాన్ని నిర్వహించేందుకు డబ్బును ఖర్చు చేస్తారు. వైద్య అత్యవసర పరిస్థితి వల్ల డబ్బులు ఖర్చవుతాయి. కుటుంబంలోని సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవడంతోపాటు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
కుంభ రాశి
వీరికి జీవితంలో సమస్యలు పెరగడంతోపాటు ఆర్థిక సంబంధ విషయాల్లో ఒడిదుడుకులు చోటుచేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడంవల్ల పనిచేయలేరు. తెలియని భయంవల్ల మనసంతా పరాగ్గా ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణం చేయవద్దు. ఆర్థిక విషయాల్లో పెద్ద పెద్ద రిస్క్ లు తీసుకోకుండా ఉండటమే మంచిది.












Click it and Unblock the Notifications