ఈనెల 19 నుంచి ఈ రాశులకు అఖండ ధనప్రాప్తి

గ్రహాలకు రాకుమారుడైన బుధుడు తెలివితేటలకు, స్నేహానికి, తర్కానికి, కమ్యూనికేషన్ కు కారకుడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న బుధుడు ఈనెల 19వ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. సూర్యుడు సింహరాశికి అధిపతి కాబట్టి బుధుడు, సూర్యుడు స్నేహపూర్వకంగా మెసలుతాయి. ఈ పరిణామాలతో కొన్ని రాశులవారికి ఏవిధంగా కలిసి రాబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం.

వృషభ రాశి
ఆరోగ్యానికి, ఐటీకి సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి విదేశాల్లో పనిచేయడానికి అవకాశాలు వస్తాయి. ధన ప్రవాహం పెరగడంతోపాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది. తోబుట్టువుల నుంచి మద్దతు లభించడంతోపాటు వ్యాపారాలను బాగా వృద్ధిలోకి తెస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారంలో ఉన్నవారికి అన్నివిధాలుగా మేలు కలగడంతోపాటు ధనప్రాప్తి కలుగుతుంది. అదనపు ఆదాయానికి ద్వారాలు తెరుచుకుంటాయి.

these zodiac sings very lucky due to mercury transit in leo 2024 july

సింహ రాశి
వ్యాపారాల్లో ఎదరవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థికంగా లాభపడతారు. ధనలాభం కలగడంతోపాటు అన్నివైపుల నుంచి ఆదాయం వస్తుంది. ప్రణాళిక ప్రకారం చేసే పనులు విజయవంతమై మీకు గుర్తింపును తెస్తాయి. వివాహం చేసుకున్నవారి జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తవుతాయి.

కన్యా రాశి
ఈ రాశివారి జీవితం అద్భుతంగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు పెరిగిన వేతనంతో పదోన్నతలున్నాయి. న్యాయపరమైన విషయాల్లో పోరాడి విజయం సాధిస్తారు. దీనివల్ల ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. కెరీర్ లో ఊహించని విధంగా ఎదుగుతారు.

ధనుస్సు రాశి
సమాజంలో హోదా పెరుగుతుంది. సంపద పెరగడంతోపాటు ధన ప్రవాహానికి కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అన్ని పనుల్లో స్నేహితులు అండగా నిలవడంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులమధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో పనికి సంబంధించి అదనపు బాధ్యతలు తోడవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+