గజకేసరి రాజయోగం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్లే
ఈ నెలలో కదలికలను మార్చుకునే గ్రహాల్లో చంద్రుడు కూడా ఒకటి. ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్లడానికి రెండున్నర రోజుల సమయం తీసుకుంటుంది. ఈనెల తొమ్మిదోతేదీ నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అదేరోజు చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు.
ప్రస్తుతం గురువు అక్కడే ఉన్నాడు. ఈ రెండు గ్రహాల కలయికవల్ల అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల మూడు రాశులవారు ప్రధానంగా ప్రయోజనాలను పొందుతారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

మేషం
వీరికి మంచిరోజులు వస్తున్నాయి. ఈ రాశివారికి అదృష్టం కలిసివస్తుంది. జీవిత భాగస్వామి దొరుకుతుంది. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కోరుకున్నంత ధనం లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. విద్యార్థులకు చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులు తమ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.
సింహం
వీరు శుభవార్తలను వింటారు. సంతానం లేనివారికి సంతాన యోగం ఉంది. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆగిపోయిన పదోన్నతి చేతికి అందుతుంది. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళతారు. కోరికలను నెరవేర్చుకుంటారు. కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం ఉంటుంది.
కర్కాటకం
వీరికి అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబంతో సంతోష సమయాన్ని గడుపుతారు. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. కీర్తి నలువైపులకు వ్యాపిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతుతో పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications