50 ఏళ్ల తర్వాత చతుర్గ్రాహి యోగం.. ఈ రాశులకు అపారమైన అదృష్టం
మీన రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు కలయిక జరగడంవల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. బుధుడు ఏప్రిల్ 9వ తేదీన మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ రాహువు, శుక్రుడు, సూర్యుడు సంచరిస్తున్నారు. దీనివల్ల 50 సంవత్సరాల తర్వాత చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ నెలలో అద్భుతమైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. సూర్యుడు, బుధుడు కలయికవల్ల బుధాదిత్య రాజయోగం, బుధుడు-శుక్రుడు కలయికవల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుండటంవల్ల కొన్ని రాశులవారి సంపద పెరుగుతోంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పనిలో ఆటంకాలన్నీ తొలగి జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
మిథున రాశి
వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. సంపద పెరుగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి.

కన్యా రాశి
కెరీర్ ఎదుగుదలకు అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారికి మంచి జరుగుతుంది. శుభవార్తలు వింటారు. తోటివారితో ఏర్పడిన విభేదాలన్నీ తొలగిపోతాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. జీవితం సంతోషకరంగా మారుతుంది.
ధనుస్సు రాశి
జీవితంలో దేనికీ లోటు ఏర్పడదు. సంబంధాల్లో ప్రేమ పెరుగుతుంది. వాహనాన్ని లేదంటే భూమిని కొనుగోలు చేస్తారు. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. జీవిత భాగస్వామి నుంచి ఊహించనిరీతిలో బహుమతులను అందుకుంటారు. జీవితాన్ని ఎంతో విలాసవంతంగా, సౌకర్యవంతంగా గడుపుతారు.
మీన రాశిలో చతుర్గ్రాహి యోగంతో పాటు బుధాదిత్య యోగం, లక్ష్మీనారాయణ యోగం కూడా పైన పేర్కొన్న మూడు రాశులవారికి అపారమైన అదృష్టాన్ని తీసుకురానున్నాయి. వంద సంవత్సరాల తర్వాత ఈ రాశిలో డబుల్ రాజయోగాలు ఏర్పడుతున్నాయి.












Click it and Unblock the Notifications