అక్టోబరు 18 నుంచి ఈ రాశులవారు ఎంతో అదృష్టవంతులు
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని శుభ ఫలితాలతోపాటు కొన్ని అశుభ ఫలితాలను కూడా ఇస్తుంటాయి. ఈ కోవలోనే సూర్యుడు ఈనెల 18వ తేదీన కన్యారాశి తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసివస్తుందని, ఫలితాలు బాగుంటాయని పండితులు తెలియజేస్తున్నారు. వారి వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి : వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉద్యోగాలు చేసేవారికి బాగుంది. పనిచేసే చోట పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. వీరికి అన్ని విధాలుగా వారి నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా, సామాజికంగా మేష రాశివారికి లాభాలున్నాయి. ఈ సమయంలో వారు ఎటువంటి పని తలపెట్టినా సులభంగా గెలుపొందుతారు. వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా గడుస్తుంది.

వృషభ రాశి: ఈ రాశివారికి ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఎటువంటి పనుల్లోనైనా సులువుగా విజయం సాధిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంవల్ల లాభాలు వస్తాయి. ఈ సమయం లావాదేవీలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.
మిథున రాశి : ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా గడుస్తుంది. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది.
కన్య రాశి : ఆర్థికంగా లాభపడతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. పదవులు, ప్రతిష్టలు ఆర్జిస్తారు. పెట్టిన పెట్టుబడులు లాభంగా మారతాయి.












Click it and Unblock the Notifications