బుధుడివల్ల 100 శాతం మార్పులు.. అంతా సంతోషమే
ఈనెల 27వ తేదీన బుధుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యక్తిగత జాతకంలో బుధుడు ప్రత్యేక స్థానంలో ఉంటే మంచి లాభాలున్నాయి. ప్రతికూల స్థానం ఉంటే మాత్రం కష్టాలు తప్పవని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. బుధుడి సంచారంవల్ల ఏయే రాశులవారిపై ఏ విధంగా ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.
మేష రాశి : ఉద్యోగస్తులకు బాగుంటుంది. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలను పొందుతారు. కుటుంబ జీవితం గడుపుతున్నవారికి మంచి ప్రయోజనాలున్నాయి. సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితం గడుపుతున్నవారికి బాగుంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

సింహరాశి : ఉద్యోగాలు చేసేవారికి అనుకూలమైన సమయం. తోటి ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసిరానుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంవల్ల ఊహించని లాభాలున్నాయి. పరిస్థితులు మెరుగుపడి సౌకర్యాలు కలుగుతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో జరిగే పనుల్లో సులువుగా విజయం సాధిస్తారు.
కన్యా రాశి : ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రమోషన్ ఉంటుంది. గతంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక పర్యటనలకు, ధార్మిక ప్రదేశాలకు వెళతారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో జరిగే పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల తో అధిక సమయాన్ని వెచ్చిస్తారు. సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.












Click it and Unblock the Notifications