2026లో సంక్రాంతి నుండి వీరి దశ తిరగబోతుంది
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను నిర్ణయిస్తాయి. 2026 జనవరి మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా ఏర్పడే యోగాలు అన్ని రాశుల వారి జీవితాలను నిర్ణయిస్తాయి. శుక్రుడు విలాసాలకు, సంపదలకు అధిపతి. అటువంటి శుక్రుడు సూర్యుడు తో కలిసి శుక్రాదిత్య రాజయోగం ఏర్పరచబోతున్నాడు.
శుక్రాదిత్య రాజయోగం
జనవరి 14న గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక జనవరి 14న అప్పటికే మకర రాశిలో ఉన్న శుక్రుడుతో కలిసి సూర్యుడు శుక్రాదిత్య రాజయోగం ఏర్పరుస్తున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. వీరికి అదృష్టం కలిసి వస్తుంది.

వృషభ రాశి
శుక్రాదిత్య రాజయోగం కారణంగా వృషభ రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. వృషభ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశి వారు కెరీర్లోనూ, బిజినెస్ లోను బాగా రాణిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. పెళ్ళికాని వారు జీవిత భాగస్వామిని పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగాలలో పనిచేసే వారికి విజయాలు వరిస్తాయి.
మకర రాశి
శుక్రాదిత్య రాజయోగం కారణంగా మకరరాశి జాతకులు అనేక విధాలుగా లాభాలు పొందుతారు. ఈ సమయంలో వీరి కెరీర్ బాగుంటుంది. బిజినెస్ పరంగా కూడా వీరికి లబ్ధి చేకూరుతుంది. మకరరాశి వారు ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ధనలాభం కలుగుతుంది. పెళ్ళికాని వారికి వివాహయోగం కలుగుతుంది. వారు జీవిత భాగస్వామిని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.
తులారాశి
శుక్రాదిత్య రాజయోగం కారణంగా తులా రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. వీరికి అన్ని విధాల మేలు జరుగుతుంది. ఆస్తులను కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. తులా రాశి వారు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. ఈ యోగం తులా రాశి వారికి అనేక విధాలుగా కలిసివస్తుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications