అమావాస్య రోజు ఈ పనులు చేస్తే అష్ట దరిద్రాలు మీ వెంటే!

హిందూ సాంప్రదాయంలో అమావాస్య రోజుకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ రోజు చంద్రుడు పూర్తిగా కనిపించదు. ఇది ఆధ్యాత్మికత, పితృ తర్పణం, నిశ్చలత్వానికి సంబంధించిన రోజుగా భావించబడుతుంది. ఈ రోజున కొన్ని నియమాలు పాటించడం వల్ల పితృ దేవతల ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు . ఈ నేపథ్యంలో, అమావాస్య రోజున కొన్ని పనులు చేయకూడదని సాంప్రదాయాలు , జ్యోతిష్యం సూచిస్తాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం..

శుభకార్యాలు చేయకూడదు: అమావాస్య రోజున కొత్త పనులను ప్రారంభించడం అనర్హంగా భావిస్తారు. వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు అమావాస్య రోజున చేయకూడదు. ఈ రోజును శుభకార్యాలకు అనుకూలమైనదిగా పరిగణించరు.

Things not to do on a new moon day Doing so is like inviting poverty

ప్రయాణాలు చేయకూడదు: అమావాస్య రోజున ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదని నమ్ముతారు. ముఖ్యంగా రాత్రివేళ ఒంటరిగా ప్రయాణాలు చేయకూడదు. ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్వసిస్తారు. దీని వెనుక ఆధ్యాత్మిక విశ్వాసం ఉండటంతో పాటు, ప్రకాశం తక్కువగా ఉండడం వల్ల ప్రమాదాలు జరగవచ్చు.

కొత్త వస్తువులు కొనకూడదు: కొత్త బట్టలు, వాహనాలు, గృహోపకరణాలు వంటివి అమావాస్య రోజున కొనకూడదు. అంతే కాకుండా అమావాస్య రోజున జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం గీయడం మరియు గోళ్ళు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు. తలకు నూనె రాయడం కూడా అమావాస్య రోజున నిషిద్ధం.

శుద్ధి కార్యక్రమాలు: కొన్ని ప్రాంతీయ సంప్రదాయాల ప్రకారం, అమావాస్య రోజున తలస్నానం చేయడం తప్పనిసరి కాకపోతే, దానిని నివారించడం మంచిదని చెబుతారు. అయితే పితృ తర్పణం చేసేవారు తప్పనిసరిగా తలస్నానం చేయవచ్చు. కొన్ని సంప్రదాయాల ప్రకారం, అమావాస్య రోజున ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడం, లేదా కొన్ని అనవసరమైన వస్తువులను తొలగించడం శ్రేయస్కరంగా ఉండదని భావిస్తారు.

వృథా ఖర్చులు : అమావాస్య రోజు ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. అవసరం లేకుండా డబ్బు ఖర్చు చేయడం దుర్గతికి దారి తీస్తుందని నమ్ముతారు.

మాంసాహారం తినకూడదు: అమావాస్య రోజున మాంసాహారం తినకూడదని అంటారు. ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది.

దుష్ట ఆలోచనలు చేయకూడదు: ఈ రోజున ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. కోపం, ద్వేషం, కలహాలకు దూరంగా ఉండాలి. అమావాస్య పితృ దేవతలకు ప్రత్యేకమైన రోజు. ఈ రోజున వారిని స్మరించుకోవడం, తర్పణాలు ఇవ్వడం చాలా మంచిది.

ఎందుకు చేయకూడదు?
అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రుడు మనస్సు , భావోద్వేగాలకు కారకుడు. చంద్రుడు కనిపించని కారణంగా, మనస్సుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అందుకే ఈ రోజున కొన్ని పనులు చేయకూడదని అంటారు. అయితే, ఇవన్నీ సాంప్రదాయ విశ్వాసాలు,నమ్మకాలు మాత్రమే. వీటిని పాటించడం అనేది వ్యక్తిగత ఇష్టంపై అధారపడి ఉంటుంది.

చేయవలసినవి:
పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడం చాలా ముఖ్యమైనది. పేదలకు దానధర్మాలు చేయడం మంచిది. దేవాలయాలను సందర్శించడం, పూజలు చేయడం శుభప్రదం. ఈ రోజున ధ్యానం, ప్రార్థన చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+