Astrology: 30 ఏళ్లు దాటినా పెళ్లి కావడం లేదా.. అయితే ఈ పని చేయండి..!

30 ఏళ్లు దాటినా పెళ్లి కాని వారు పలు పూజలు చేస్తే మంచి జరుగుతుందట.

గతంలో చాలా మందికి చిన్న వయస్సులోనే పెళ్లి చేసేవారు. అమ్మాయిలకైతే 22 ఏళ్లలోపే పెళ్లి చేసేవారు. అబ్బాయిలకైతే 25 ఏళ్లలోపే వివాహం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా మంది జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు మగ అయనా, ఆడ అయినా 25 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. చాలా మంది పురుషులు 28 నుంచి 30 ఏళ్ల మధ్యన ఎక్కువగా పెళ్లి చేసుకుంటున్నారు.

శివ పూజ

శివ పూజ

అయితే చాలా మంది పెళ్లి కానీ వారు కూడా ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధం కుదరడం లేదని, ఏదో ఒక కారణంతో వివాహం ఆగిపోతుందని మనోవేదనకు గురవుతుంటారు. ఇలా పెళ్లి సంబంధాలు కుదరని వారు కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా వివాహం జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. పెళ్లి సంబంధాలు కుదరని వారు శివ పూజలు చేస్తే మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

కార్తీక మాసం

కార్తీక మాసం


ముఖ్యంగా పెళ్లి కాని వారు కార్తీక మాసంలో శివుడికి పూజలు నిర్వహించాలని వివరిస్తున్నారు. కార్తీక మాసం పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దేవతలకు స్వర్గాన్ని తిరిగి ఇచ్చాడని నమ్ముతారు. ఈ రోజున దేవతలు, దానవులు సంతోషంగా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి.

పసుపు

పసుపు

వివాహం ఆలస్యమయ్యే వారు కార్తీక మాసం పౌర్ణమి రోజున లక్ష్మీమాతకు పసుపును సమర్పించాలి. మీ నుదుటిపై పసుపు తిలకం కూడా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరగా పెళ్లి సెటిలయ్యే అవకాశం ఉంది. అలాగే కార్తీక పూర్ణిమ నాడు పార్వతీ మాతకు కుంకుమను సమర్పిస్తే మంచిదట. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున తులసికి సాలిగ్రామంతో వివాహమైంది.

అందువలన త్వరలో వివాహం చేసుకోవాలనుకునే వారు ఈ రోజున తులసి పూజ చేస్తే మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.అయితే కొన్నిసార్లు వాస్తు కూడా పెళ్లి ఆలస్యం కావడానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+