శుక్రుడు-కేతు సంయోగం.. ఈ రాశులకు అద్భుత ధనయోగం
ఆగస్టు ఐదో తేదీ నుంచి పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. ప్రతి నాలుగు వారాలకు తన రాశిని శుక్రుడు మార్చుకుంటాడు. ప్రస్తుతం సింహరాశిలో ఉన్న శుక్రుడు ఈనెల 25న కన్యారాశిలోకి సంచారం చేస్తాడు. అప్పటికే అక్కడ కేతువు తిరోగమన దశలో ఉన్నాడు. ప్రతి ఏడాదిన్నరకు తన రాశిని మార్చుకునే కేతువు ఈ ఏడాది సెప్టెంబరు 18వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. శుక్రుడు-కేతువు సంయోగంవల్ల కొన్ని రాశులకు అదృష్టం వరిస్తుంది. వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే అతనికి తిరుగులేని జీవితం సొంతమవుతుంది.
వృశ్చిక రాశి
ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు వారితో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. కష్టానికి తగినరీతిలో విజయాలను అందుకుంటారు. పనితీరుపై అందరి నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది. వారు కోరుకున్న చోటకు బదిలీ అవుతారు. వీరికి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రాశి 11వ ఇంట్లోనే కేతువు-శుక్రుడి సంయోగం జరుగుతోంది.

కర్కాటక రాశి
గతంలో మొదలు పెట్టిన పనులను ఈ సమయంలో సులువుగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. తోబుట్టువులతో సంబంధాలు చాలా బాగుంటాయి. సంపద గణనీయంగా పెరగడంతోపాటు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. జీవితం మొత్తం శాంతి సౌఖ్యాలతో విలసిల్లుతుంది. పిల్లల నుంచి ఈ సమయంలోనే శుభవార్తలను అందుకుంటారు.
సింహ రాశి
కళ, సంగీతంపై ఈ సమయంలో బాగా ఆసక్తి ఏర్పడుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారి కోరకలు నెరవేరతాయి. కొత్తగా పెళ్లయినవారికి సంతానం కలగడంతోపాటు డబ్బును బాగా సంపాదిస్తారు. ఈ రాశి రెండో ఇంట్లోనే కేతువు, శుక్రుడి సంయోగం జరుగుతుండటంతో అన్ని పనుల్లో విజయాన్ని అందుకుంటారు. వ్యక్తిత్వాన్ని బట్టి ఉన్నతస్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంది. కెరీర్ లో ఎదగడానికి చేసుకునే ప్రణాళికలను చక్కగా అమలు చేసుకుంటూ ముందుకు వెళతారు.












Click it and Unblock the Notifications