కుంభరాశిలోకి రాహువు... ఈ రాశుల సుడి తిరిగింది
రాహువు, కేతువు అశుభ గ్రహాలని చాలామంది భయపడతారు. ఇవి నీడ గ్రహాలు. వీటిని ఎవరూ విడదీయలేరు. ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి 18 నెలల సమయం తీసుకుంటాయి. వేర్వేరు రాశుల్లో ఇవి సంచరిస్తున్నప్పటికీ వీటి ప్రవర్తన మాత్రం ఒకేలా ఉంటుంది. తిరోగమనదిశలోనే రాహువు, కేతువు ప్రయాణిస్తుంటారు.
2025లో ఈ రెండు గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి. రాహువు కుంభరాశిలోకి మారతాడు. శనిగ్రహానికి చెందిన రాహువు రాశి మార్పువల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీనివల్ల వారికి బాగా కలిసిరానుంది. ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి
ఈ ఏడాది మంచి ఫలితాలున్నాయి. ఆర్థికంగా ఒక స్థాయికి వస్తారు. మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని పనులు విజయవంతం అవడానికి తోడ్పడతాయి. ఖర్చులు తగ్గించుకొని డబ్బును పొదుపు చేసుకుంటారు. ఆరోగ్యం కోసం వివిధ రకాల యోగాసనాలు నేర్చుకుంటారు. కొత్తగా ఇల్లు, వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులు మాత్రం క్రీడల్లో అద్భుతంగా రాణిస్తారు. విద్య కోసం విదేశాలకు వెళ్లడానికి కూడా అవకాశం లభిస్తుంది. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు సులువుగా అవుతాయి.

మేష రాశి
వ్యాపారంలో బాగా వృద్ధి చెందుతారు. ఆదాయం పెరిగి రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి.. అవి బాగా లాభదాయకంగా ఉంటాయి. ఆస్తికి సంబంధించి కొంతకాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు వీరిక మంచి లాభాలను కలిగిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. రాహువు సంచారం ఈ రాశివారికి రెట్టింపు లాభాలను, రెట్టింపు ప్రయోజనాలను కలిగించబోతోంది.
వృషభ రాశి
వ్యాపారంలో అదృష్టం కలిసివస్తుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభింపదలిస్తే మీకు సానుకూలంగా ఉంటుంది. పాత వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడంవల్ల ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. పై అధికారులు అనుకూలంగా ఉండటంవల్ల ఇలా జరుగుతుంది. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. గొడవలన్నీ సమసిపోయి భార్యాభర్తలు బాగుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications