ఏప్రిల్ నెలలో ఈ రాశుల సుడి తిరుగుతోంది

ఏప్రిల్ ఒకటోతేదీ అందరూ ఏదో ఒక అబద్ధం చెప్పి ఏప్రిల్ పూల్ అంటూ ఆటపట్టిస్తుంటారు. అటువంటి రోజున సంపదకు, విలాసవంతమైన జీవితానికి, అందానికి, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అదే నెల 26వ తేదీ వరకు పూర్వాభాద్రలోనే సంచారం చేస్తాడు. దీనివల్ల ఎవరైనా ఏప్రిల్ పూల్ చెప్పినా (సంపదకు, ఐశ్వర్యానికి సంబంధించి) అది నిజం చేయగలిగిన శక్తి శుక్రుడి సొంతం. రాక్షసులకు గురువైన శుక్రుడి కదలికలకు జ్యోతిష్యం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ప్రకారం ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

కుంభ రాశి
ఉద్యోగస్థులకు, వ్యాపారస్తులకు ఈ సమయం చాలా బాగా కలిసివస్తుంది. సమాజంలో హోదా పెరగడంతోపాటు గౌరవం కలుగుతుంది. అందరూ జీ హుజూర్ అనేలా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఇరువైపులా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేయాల్సిరావొచ్చు. ఉద్యోగస్థులకు వేతనాలు పెరుగుతాయి. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు.

three zodiac signs will be financially strong in the month of April due to venus will enter purvabhadra nakshatram

వృషభ రాశి
కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే అదృష్టవంతులవుతారు. గతంలోకంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడుతుంది. ఉద్యోగస్థులకు వారి కార్యాలయాల్లో మంచి పేరు రావడంతోపాటు పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం కలుగుతుంది. అది వీరికి లాభసాటిగా మారుతుంది. వారినుంచి ప్రయోజనాలు అందుకుంటారు. అదృష్టం చాలా ఎక్కువగా ఉంది.

మకర రాశి
పూర్వాభాద్రలో శుక్రుడు సంచారం చేయడం ఈ రాశివారికి తీవ్రంగా కలిసివస్తుంది. అదృష్టవంతులవుతారు. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా పూర్తిచేయగలిగిన సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యులందరి మధ్య అనుబంధం బలపడుతుంది. తీర్థయాత్రలకు వెళతారు. వ్యాపారాస్తులకు ఈ సమయంలోనే లాభాలు చాలా ఎక్కువగా వస్తాయి. వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాల్లోకి పెట్టుబడుల కింద మళ్లిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+