ఈ రాశులకు రాత్రికి రాత్రే కుబేర యోగం
చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలో గ్రహాల రాకుమారుడైన బుధుడు, రాక్షసుల గురువైన శుక్రుడు సంయోగం చెందుతున్నారు. ఈ రెండు కీలక గ్రహాలు కలవడంవల్ల శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారు అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. బుధుడు తెలివితేటలకు, తర్కానికి, వ్యాపారానికి కారకుడు. శుక్రుడు సంపదకు, విలాసవంతమైన జీవితానికి, కళలకు కారకుడు. ఏ రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఈ రాశివారికి ధనలాభం ఉంది. శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగంవల్ల ఎన్నో ప్రయోజనాలను వీరు పొందుతారు. ఈ నెలంతా వీరికి బాగా కలిసిరానుంది. కొత్తగా ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఊహించనిరీతిలో వీరికి ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళతారు.

తులా రాశి
ఈ రాశివారికి ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించినవారికి మాత్రం అదృష్టం కలిసివస్తుందని చెప్పొచ్చు. గతంలో నిలిచిపోయిన పెండింగ్ పనులు, ఎప్పటినుంచో మీరు చేయాలనుకుంటున్న పనులన్నీ ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. దీంతోపాటు వేతనం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు.
వృశ్చిక రాశి
సమాజంలో మంచి గౌరవాన్ని పొందడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. లక్ష్మీనారాయణ యోగం ఒకరకంగా వీరికి వరంలాంటిదని చెప్పొచ్చు. అన్నిరంగాల్లో వీరు తమదైన శైలిలో ముద్ర వేస్తారు. కొత్త అవకాశాలను వినియోగించుకొని అందలం ఎక్కుతారు. అదనపు ఆదాయానికి వీరికి అవకాశాలు తలుపు తడతాయి.












Click it and Unblock the Notifications