బుధుడు, గురుడి కలయికతో ఈ రాశులకు అఖండ కుబేర యోగం
గ్రహాలకు రాకుమారుడు బుధుడు. తెలివితేటలు, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అలాగే దేవతల గురువైన బృహస్పతి జ్ఞానంతోపాటు సంతానాన్ని, ఐశ్వర్యాన్ని, ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు. వచ్చే నెల 14వ తేదీన గురుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రాశిలోకి జూన్ ఆరోతేదీన బుధుడు ప్రవేశిస్తాడు. ఇలా ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో సంయోగం చెందడంవల్ల అద్భుతమైన శుభయోగం ఏర్పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అదృష్టం కలిసివచ్చు అందలాలెక్కుతారని, మంచి ప్రయోజనాలు దక్కుతాయని చెబుతున్నారు. ఏయే గ్రహాలకు ఈ శుభయోగంవల్ల ఎలా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మిథునరాశి
దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. అవి కూడా లాభాలనే కలుగజేస్తాయి. భారీ మొత్తంలో డబ్బు మీ చేతికి వస్తుంది. అది ఎక్కడినుంచైనా రావచ్చు. ఆధ్యాత్మిక వాతావరణంపై ఆసక్తి చూపుతారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి. వివిధరకాల చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సమయంలో వాటినుంచి విముక్తి కలుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ అవసరం.

తులా రాశి
వీరికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. దీనివల్ల ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు. ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. కెరీర్ పరంగా ఇప్పటివరకు ఎన్నడూ చూడనంత లాభాలను పొందుతారు. బుధుడు, గురుడి కలయిక వల్ల వీరి కెరీర్ మంచి స్థాయికి చేరుకుంటుంది. మంచి జీవితం కూడా వీరికి ఇప్పటినుంచే ప్రారంభమవుతుంది.
సింహరాశి
అదృష్టం వీరి తలుపు తడుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగస్థులకు వేతనం పెరుగుదలతోపాటు ప్రమోషన్ ఉంది. కెరీర్ పరంగా వీరు మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కానీ వీరు వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడుల కోసం ఆలోచిస్తారు. అందుకు కొంత సమయం పడుతుంది. పోటీపరీక్షలు రాసేవారికి అంతా శుభమే కలుగుతుంది. జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. దీనివల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications