బుధుడి ఎఫెక్ట్‌తో 70 రోజుల్లో కోటీశ్వరులవుతున్న రాశులు వీరే
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాల రాకుమారుడు బుధుడు ఈనెల 22వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఆ రాశిలో సంచారం చేస్తున్న బుధుడు కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలను రాశిచక్రాలవారికి అందిస్తున్నాడు. దాదాపు 70 రోజులు వీరికి ప్రయోజనాలు అందుతాయి. బుధుడు తెలివితేటలు, తర్కం, వ్యాపారం, కళలు, ఫ్యాషన్ తదితర రంగాలకు కారకుడు. బుధుడి సంచారంవల్ల ఏయే రాశులవారు ఏవిధంగా ఆర్థిక లాభాలను అందుకుంటున్నారు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఉద్యోగాలు చేసేవారికి అద్భుతమైన ఫలితాలున్నాయి. కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు చేపడతారు. వేతనాలు పెరుగుతాయి. వ్యాపారస్తులు పాత అప్పుల నుంచి బయటపడతారు. కొత్తగా అన్ని రంగాల్లో అడుగుపెట్టి విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులున్నాయి. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఈ రాశివారిలో ఉద్యోగాలు చేసేవారు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.

కన్యారాశి
ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కొందరు వ్యక్తులతో మధురమైన సంబంధాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితంపై బుధుడి సంచారం ప్రభావం చూపుతుంది. దీనివల్ల భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారితో మధురమైన జ్ఞాపకాలను పొందుతారు. పని విషయంలో కష్టపడతారు. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది.
మిథున రాశి
వీరికి 70 రోజులు ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెడతారు. అలాగే పొదుపు కూడా చేస్తారు. దీనివల్ల భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అధిక సమయాన్ని కేటాయిస్తారు. సంపాదన విషయంలో ఎంతో ఆలోచిస్తారు. కష్టపడి ఫలితాలను సాధిస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు.












Click it and Unblock the Notifications