ఒక్కరోజు ఆగండి... ఈ రాశులు కోట్లకు పడగలెత్తుతాయి
రాహువు, కేతువు అంటే అందరూ భయపడతారుకానీ అవి కూడా ఎంతో మంచిని చేస్తాయి. ఈ రెండింటికీ ఛాయా గ్రహాలని పేరు. ప్రతి 18 నెలలకు ఒకసారి తమ రాశులను మారుస్తుంటాయి. ఈనెల 20వ తేదీన రాహువు పూర్వాభాద్ర నక్షత్రంలోకి, కేతువు పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి సంచారం చేస్తాయి. ఇలా ఈ రెండు గ్రహాలు నక్షత్రాలను మార్చుకోవడంవల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు ఆ ప్రయోజనాలు దక్కుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి
కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఎక్కువగా కష్టపడతారు. జీవితంలో ఊహించనిరీతిలో ధనలాభం ఉంది. ఉద్యోగస్థులకు 20వ తేదీ నుంచి ప్రమోషన్లతోపాటు వేతనాల పెరుగుదల ఉంటుంది. కోరుకున్నచోటకు బదిలీపై వెళతారు. అనుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. భారీ లాభాలను కళ్లచూస్తారు. ఏ పని తలపెట్టినా ఈ రాశివారికి విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయి.

తులా రాశి
వ్యాపారాలు చేస్తున్నవారికి చాలా బాగుంటుంది. లాభాలు భారీగా ఉంటాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఆర్థికంగా అనేక ప్రయోజనాలను కొల్లగొడతారు. గతంలోకంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా మారిపోతుంది. మంచి స్థితికి చేరుకుంటారు. సంపాదన కూడా భారీగా పెరుగుతుంది. మంచి జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తారు. అందరూ కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్యారాశి
ఈనెల 20వ తేదీ నుంచి వీరి జాతకం మారిపోనుంది. ఆర్థికంగా భారీ లాభాలను అందుకుంటారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. భవిష్యత్తులో మంచి రాబడులు అందుకుంటారు. అన్నిరంగాల్లోను విజయాలను సాధిస్తారు. సంపాదనకు ఎటువంటి లోటు ఉండదు. అలాగే డబ్బులకు ఇబ్బంది పడే పరిస్థితి రాదు. గతంలో పనులకు అడ్డంకులు ఎదురుకాగా ఇప్పుడు అవి పూర్తవుతాయి. జీవితం మొత్తం ఆనందకరంగా, లాభదాయకంగా సాగుతుంది. వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంది. నగదు ప్రవాహం ఉంటుంది.












Click it and Unblock the Notifications