నేటి నుంచి 44 రోజులు ఈ రాశులపై కనక వర్షం కురిపిస్తున్న శని
న్యాయదేవత, చేసిన కర్మల ప్రకారం ఫలితాలను అనుగ్రహించే శని దేవుడు రాశి సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి చాలా నెమ్మదిగా సంచరిస్తాడు. ఈ ఏడాది మొత్తం కుంభరాశిలో ఉండే శని ఏప్రిల్ నెలలో పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించచాడు. ఈనెల 18వ తేదీన పూర్వాభాద్ర మూడో దశలోకి అడుగు పెడుతున్నాడు. దీనితర్వాత శతభిషలోకి వెళతాడు. పూర్వాభాద్ర మూడో దశలోకి రావడంవల్ల 44 రోజులపాటు శనిదేవుడు కొన్ని రాశులపై కనక వర్షం కురిపించనున్నాడు.
కన్యా రాశి
శని సంచారంవల్ల ఈ రాశివారికి పలు విషయాల్లో ఎదరవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. అదృష్టం వల్ల ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఇదే క్రమంలో కీర్తి కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. పనిలో మంచి పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బును తిరిగి ఈ సమయంలోనే పొందుతారు.

కుంభరాశి
శనిదేవుడి సంచారం వల్ల జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అలాగే ఐశ్వర్యానికి, శ్రేయస్సుకు లోటు ఉండదు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. శనిదేవుడి నక్షత్ర మార్పు వల్ల కుంభరాశివారికి విపరీతమైన మేలు కలుగుతుంది. వివాహ బందంలో ఉన్నవారు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. గతం నుంచి ఉన్న చిన్న చిన్న వివాదాలు సమసిపోతాయి.
మిథున రాశి
జీవితంలో సానుకూలత పెరిగి విజయాలు సాధిస్తారు. ఆలోచనా తీరు మారుతుంది. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగస్తుల అభివృద్ధికి అనేక అవకాశాలు తలుపుతడతాయి. ఈ నెల మొత్తం వీరికి శనిదేవుడి ఆశీస్సులు లభిస్తాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేయడానికి కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణంగా మద్దతు లభిస్తుంది.












Click it and Unblock the Notifications