సరిగ్గా నెలరోజులు ఆగండి.. ఈ రాశులవారే మహారాజులు
గురుడు అత్యంత శుభప్రదమైన వ్యక్తి. ఏడాదికోసారి రాశిని మార్చుకుంటాడు. సంపద, శ్రేయస్సు, సంతానం, వివాహం, శుభకార్యాలకు కారకుడు. గురుడి రాశి లగ్నంలో ఉంటే ధనయోగం కలుగుతుంది. ఈ ఏడాది తన స్థానాన్ని గురుడు మార్చుకోబోతున్నాడు. మే ఒకటోతేదీన వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారు పూర్తి అదృష్టాన్ని పొందబోతున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశి రెండో ఇంట్లో గురువు సంచరిస్తాడు. ఆర్థికంగా మంచి పురోగతి సాధించడంతోపాటు కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మాటలవల్ల పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తోపాటు జీతం పెరుగుదల ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగస్తులకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నప్పటికీ వాటిని ఎంతో చాకచక్యంగా పూర్తిచేయగలుగుతారు. పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారు.

వృశ్చికరాశి
ఈ రాశి సప్తమంలో గురుడు సంచరిస్తాడు. వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తగ్గిపోతాయి. వ్యాపారంలో ఇతరుల గౌరవాన్ని పెంచే పరిణామాలు కలుగుతాయి. జాయింట్ వెంచర్లు మంచి పురోగతిని తెస్తాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థికంగా సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. విద్యార్థులకు ప్రస్తుత సమయం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులన్నీ విజయవంతమవుతాయి.
వృషభ రాశి
ఉద్యోగానికి సంబంధించి చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను తీసుకువస్తాయి. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులంతా అనుకూలంగా ఉంటారు. వైవాహిక జీవితంలోని చిన్న చిన్న సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. వివాహం కానివారికి వివాహం జరుగుతుంది. అదృష్టం తోడుంటుంది. దీనివల్ల చేపట్టే ప్రతి పని విజయవంతంగా పూర్తిచేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు.












Click it and Unblock the Notifications