ఇప్పటికే ఈ రాశుల దశ, దిశ మారిపోయింది... మహర్జాతకులయ్యారు

గ్రహాల రాశి సంచారం అనేది సమాజ జీవితాన్నే కాకుండా మానవుల వ్యక్తిగత జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది. గ్రహాలు ఇలా సంచారం చేసే సమయంలో కొన్ని మంచి పరిణామాలు కలుగుతంటాయి. ఇవి రాశులవారికి ఆర్థికంగా కలిసివచ్చి మంచి ఫలితాలను కలగజేస్తుంటాయి. అలాగే నీడ గ్రహమైన కేతువు అంటే అందరికీ భయం.

అది చెడు చేస్తుందని భావిస్తారు. కానీ అది మంచి కూడా చేస్తుంది. ఏడాదిన్నరకోసారి తన రాశిని మార్చుకునే కేతువు గతేడాది నవంబరు 10న పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ సంవత్సరం జులై 20వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. ఈ ప్రయాణంవల్ల కేతువు ఏయే రాశులకు ఏవిధంగా కలిసివచ్చేలా చేస్తాడనే విషయాన్ని తెలుసుకుందాం.

three zodiac signs will gain great wealth due to the transit of Ketu purvabhadra nakshatram

కర్కాటక రాశి
కష్టకాలంలో స్నేహితులతోపాటు బంధువుల నుంచి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల నుంచి సహాయం అందుతుంది. సమాజంలో హోదా, గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక వాతావరణం పట్ల ఆసక్తి కనపరుస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. ఇతరులను బాగా గౌరవిస్తారు. కేతువు ఆశీస్సులవల్ల ఈ రాశివారు మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు జీవితంలో స్థిరపడతారు. అందుకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

సింహ రాశి
ఈ రాశివారికి కూడా ఆధ్యాత్మికతపట్ల ఆసక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. విదేశాల్లో చదువుకోవాలని ఆశిస్తున్నవారి కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. వీరికి మంచి ధనలాభం కూడా ఉంది. వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోవడం, పొదుపు చేసుకోవడంపై ఈ రాశివారి భవిష్యత్తు ఆధారపడివుంటుందని, దుబారా చేయవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

మేష రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. దుబారా ఖర్చులు తగ్గించుకొని డబ్బు పొదుపు చేసుకుంటే మంచి భవిష్యత్తు ఈ రాశివారి సొంతమవుతుంది. వీరికి తోడుగా అదృష్టం ఉంది. కేతువు వల్ల వీరికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. కుటుంబ సభ్యల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు చాలా బాగుంది. డబ్బులిచ్చే సమయంలో అవి తిరిగి వస్తాయా? రావా? అని ఆలోచించి ఇవ్వాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+