అంగారకుడి తిరోగమనంతో ఈ రాశులకు అనంతమైన సిరిసంపదలు
నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి నిరంతరం సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని మంచి ఫలితాలు, కొన్ని చెడు ఫలితాలను ఇస్తుంటాడు. చెడు ఫలితాలు కూడా మంచికే జరుగుతుంటాయి. ఈ సంచారంలో తిరోగమనానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి 45 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకునే అంగారకుడు వచ్చే నెల 26వ తేదీన మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం వృషభరాశిలో సంచారం చేస్తున్నాడు. డిసెంబరు ఏడోతేదీ నుంచి తిరోగమనం చేస్తుండటంవల్ల అన్ని రాశులవారు ప్రభావితులవుతున్నారు. అంగారకుడు తిరోగమన దశలో ఉండటంవల్ల ఏ రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది? ఏవిధంగా ప్రయోజనాలు కలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
అన్ని ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి జీవితం సుఖశాంతులతో నడుస్తుంది. ఎటువంటి సమస్య ఎదురైనా తమ తెలివితేటలతో చురుగ్గా పరిష్కరించగలుగుతారు. ధైర్యం పెరగడంతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు. జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు, ప్రభావశీలురను, ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. ఈ రాశిలోనే కుజుడి తిరోగమనం జరుగుతుండటంతో వీరికి బాగా కలిసివస్తుంది.

మేష రాశి
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవారికి బాగా కలిసివస్తుంది. భౌతికంగా సుఖాలు కలుగుతాయి. ఎదుటివారితో మాట్లాడే విషయంలో నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇదే సమయంలో కొత్త ఇంటిని లేదంటే స్థలాన్ని, కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అన్ని పనులు ఈ సమయంలో సులువుగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు బాగుంటుంది. ఈ సమయంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
కన్యా రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. డబ్బును పొదుపు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. వీటికితోడు అదనపు ఆదాయ మార్గాలు కూడా తోడవుతాయి. పనిచేసేచోట మంచి విజయాన్ని సాధించడంతో పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు.












Click it and Unblock the Notifications