చంద్ర-కేతువుల సంయోగం.. ఈ రాశుల పంట పండింది

చంద్రుడు మనసుకు కారకుడు. కేతువు నీడ గ్రహం. ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని కేతువు మార్చుకుంటుంది. శనిదేవుడి తర్వాత అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాలని రాహువు, కేతువుకు పేరు. ప్రస్తుతం సింహరాశిలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు. అదే రాశిలో కేతువు కూడా సంచారం చేస్తున్నాడు.ఈ నెల ఒకటో తేదీన చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. నాలుగో తేదీన కేతువు వెళ్లాడు. అయితే సింహరాశిలో చంద్రుడు, కేతువు కలుసుకోవడంవల్ల కొన్ని రాశులవారికి సానుకూల ఫలితాలు కలుగుతున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.

మీన రాశి
వీరికి అంతా శుభం జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆందోళన అవసరంలేదు. జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలన్నీ తగ్గిపోతాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలను అందుకుంటారు. ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. వచ్చిన డబ్బును పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

three zodiac signs will get all financial benefits and good health due to moon and ketu conjuntion

వృషభ రాశి
వ్యాపారస్తులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. ఉద్యోగం చేస్తున్నవారికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారు కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతోపాటు అందరూ కలిసి విహారయాత్రలకు వెళతారు. ఆర్థికంగా పరిస్థితి బలపడటంతో అందరూ సంతోషంగా జీవిస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.

వృశ్చిక రాశి
ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా ధనాన్ని పొందుతారు. వచ్చిన డబ్బును పొదుపు చేయాలి. ప్రేమ జీవితంలో ఉన్నవారు రొమాంటిక్ గా జీవితాన్ని గడుపుతారు. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. అందరూ కలిసి విహారయాత్రలకు వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+