ఈనెల 28 నుంచి ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
జ్యోతిష్యం ప్రకారం కుజుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన శక్తికి, ధైర్యానికి, బలానికి కారకుడు. కుజుడు ప్రతి 45 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. ఇలా రాశిని మార్చే క్రమంలో అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతాడు. ఈ నెల 28వ తేదీన కుజుడు కన్యారాశిలోకి సంచారం చేస్తాడు. దీని ప్రభావం అన్ని రాశులపై పడుతోంది. కెరీర్ లో కొన్ని గొప్ప ప్రయోజనాలను, విజయాలను దీనివల్ల కొన్ని రాశిచక్ర గుర్తులు అందుకుంటారు. ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఈ సమయంలో ఈ రాశివారి ఆనందానికి అంతుండదు. ఉద్యోగస్థులకు వారి సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. ఉద్యోగంలో కొంతకాలం నుంచి ఎదురవుతున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. అన్నిరంగాల్లోను వీరు విజయం సాధించడానికి అదృష్టం తోడుంటుంది. వ్యాపారంలో బాధ్యతలు పెరుగుతాయి. పెట్టుబడులు కొత్తవి పెడతారు. కొత్తగా వాహనాన్ని లేదంటే భూమిని కొనుగోలు చేస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. కన్నతల్లి ఆరోగ్యం మెరుగవుతుంది.

సింహ రాశి
కష్టానికి తగిన ప్రతిఫలం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. కెరీర్ పరంగా మంచి వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సభ్యులతో గతంలోకంటే ఇప్పుడు ఎక్కువ అనుబంధంతో ఉంటారు. కొత్తగా భూమిని కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. ఒకరకంగా ఈ రాశివారికి అనేక శుభ ఫలితాలు కలుగుతున్నాయి.
మకర రాశి
వీరు అన్నీ శుభ ఫలితాలనే అందుకుంటారు. దాంపత్య జీవితంలో భార్యాభర్తలిద్దరూ సంతోషంగా జీవిస్తారు. కెరీర్ పరంగా విజయాలు అందుకుంటారు. ఈ రాశి విద్యార్థులకు పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో సీటు దక్కుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఈ రాశివారు సంతోషంగా ఉండటంతోపాటు భాగస్వామి సలహాతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలను అందుకుంటారు.












Click it and Unblock the Notifications