బుధుడి అనుగ్రహంతో ఈ రాశుల పంట పండింది
గ్రహాల రాకుమారుడు బుధుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి అన్ని రంగాల్లో విజయాన్ని సాధించగలుగుతాడు. తెలివితేటలకు, బుద్ధికి, మేధస్సుకు బుధుడు కారకుడు. వ్యాపారాలకు కూడా బుధుడే అధిపతి. గ్రహాలు నిర్దిష్ట సమయంలో తమ రాశిని మార్చుకున్నట్లుగానే బుధుడు కూడా ప్రతి నెలకు ఒక రాశి సంచారం చేస్తాడు. ఏప్రిల్ లో కూడా రాశిని మార్చుకోవడంతోపాటు నక్షత్రాన్ని కూడా మార్చుకోబోతున్నాడు. రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. బుధుడి వల్ల కొన్ని రాశులవారు పలు ప్రయోజనాలను పొంది జీవితంలో ఆర్థికంగా స్థిరపడనున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి బుధుడి వల్ల విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారస్తులు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వాటివల్ల ఆర్థికంగా లాభాలున్నాయి. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరిస్తారు. డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమవడమే కాకుండా అదృష్టం కలిసివచ్చు అన్ని పనులు పూర్తవుతాయి. సంపద విపరీతంగా పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది.

కర్కాటక రాశి
ఉద్యోగస్థులకు ఈ సమయంలోనే మంచి అవకాశాలు వస్తాయి. కొంతకాలం నుంచి వేధిస్తున్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలున్నాయి. అవి కూడా పరిష్కారమవుతాయి. కొంతకాలంగా ఉన్న న్యాయ సంబంధిత విషయాల్లో కోర్టు తీర్పు వీరికి అనుకూలంగా వస్తుంది.
వృషభ రాశి
వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. భవిష్యత్తులో వీటి నుంచి మంచి లాభాలను అందుకుంటారు. పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులన్నీ బుధుడివల్ల తొలగిపోతాయి. కుటుంబ సభ్యులంతా అన్యోన్యంగా మెలగుతారు. ఆధ్యాత్మిక వాతావరణంవైపు మొగ్గుచూపడంతో అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళతారు.












Click it and Unblock the Notifications