ఈ రాశుల దశ, దిశ మారుస్తున్న శుక్రుడు

రాక్షసుల గురువైన శుక్రుడు సంపదకు, విలాసవంతమైన జీవితానికి, ఫ్యాషన్ కు, కళలకు కారకుడు. గత నెల 29వ తేదీన శుక్రుడు మేష రాశి నుంచి తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల కొన్ని రాశులవారి ఇళ్ళల్లో ధనలక్ష్మీ తాండవం చేస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు శుక్రుడు అదృష్టాన్ని తీసుకురానున్నాడు? వారికి ఎలా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
జీవితాన్ని చిక్కుల్లో పడేసే సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఒక్కొక్కటిగా వదిలించుకుంటూ వస్తుంటారు. అదనపు ఆదాయానికి కొత్తగా వనరులు దొరుకుతాయి. దాంపత్య జీవితంలో భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాలన్నీ తొలగిపోతాయి. ఏ పని ప్రారంభించినా అందులో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. అందుకు తగ్గ అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. డబ్బులు వచ్చినప్పటికీ అవి నిలవకపోవడంతో బాధపడుతుంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శుక్రుడిని పూజించాలి.

three zodiac signs will get amazing benefits and and save money due to venus entered taurus

మేష రాశి
కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. అందరూ ఆనందంగా ఉంటారు. కొత్త కంపెనీల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు కంపెనీ మారడానికి ఇది అనువైన సమయం. శుక్రుడివల్ల అనేక విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్తులు వారి పై అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. కొత్తగా ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నవారికి ఇది మంచి సమయం. ఎటువంటి పరిస్థితుల్లోను నోటిలో మాటను బయటకు చెప్పొద్దు. లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

కర్కాటక రాశి
పెళి కానివారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. బాగా సంపన్న కుటుంబాలతో వియ్యం కుదురుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఖర్చులున్నప్పటికీ ఆదాయం భారీగా పెరుగుతుంది. డబ్బును పొదుపు చేస్తారు. అన్నతమ్ముడు, అక్కచెల్లెళ్లలో సంబంధాలు చాలా బాగుంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోను డబ్బును దుబారా చేయవద్దు. అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవాలి. లేదంటే ఆర్థికంగా నష్టపోతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+