ఈ రాశులకు అఖండ ధనయోగాన్నిస్తున్న బుధుడు, శని
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో రాశిచక్ర గుర్తులకు మంచి ఫలితాలు కలుగుతుంటాయి. అలాగే రాశుల్లోకే కాకుండా నక్షత్రాల్లోకి కూడా గ్రహాలు సంచారం చేస్తుంటాయి. అప్పుడు కూడా మంచి ప్రయోజనాలే కలుగుతాయి. న్యాయదేవుడైన శనిదేవుడు ప్రస్తుతం పూర్వాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. ఈనెల మూడోతేదీన గ్రహాల రాకుమారుడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అయిన బుధుడు పూర్వాభాద్రలోకి ప్రవేశించాడు. ఈ రెండు గ్రహాల కలయికవల్ల కొన్ని రాశులకు మంచి ఆర్థిక ప్రయోజనాలు కలగబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
తులా రాశి
శని, బుధ సంయోగం ఈ రాశివారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతోపాటు ఉద్యోగం చేస్తున్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు విదేశాల నుంచి మంచి ఆర్డర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారి జీవితం చాలా బాగుంటుంది. ఇరువైపులా పెద్దలు అంగీకరిస్తారు. దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారు.

మిథున రాశి
వ్యాపారస్తులు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి, మిగతావారు ఇతరత్రా పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్థులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. నిరుద్యోగులకు అవకాశాలున్నాయి. పెద్దల నుంచి, భార్యవైపు నుంచి ఆస్తులు కలిసివచ్చే అవకాశం ఉంది. డబ్బును దుబారా చేయడం మానుకుంటే మంచి భవిష్యత్తు వీరికి సొంతమవుతుంది.
వృషభ రాశి
విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. స్నేహితులు, సన్నిహితుల ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నవారికి ఇది మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు. అలాగే వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది.












Click it and Unblock the Notifications