శుక్రుడితో ఈ రాశులకు కలిసిరానున్న ఆస్తులు, పెరగనున్న సంపద
రాక్షసుల గురువైన శుక్రుడు నవగ్రహాల్లో కీలక గ్రహం. సంపదకు, కళలకు, ఫ్యాషన్ రంగాలకు, అందానికి, విలాసవంతమైన జీవితానికి కారకుడు. జాతకంలో శుక్రడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకం అదృష్ట జాతకం అవుతుంది. వచ్చే నెలో శుక్రుడు ఏకంగా నాలుగు సార్లు సంచారం చేయబోతున్నాడు. ఇది చాలా అరుదైన పరిణామం. 1వ తేదీన ఆరుద్ర నక్షత్రంలోకి, 12వ తేదీన పునర్వసు నక్షత్రంలోకి, 21వ తేదీన కర్కాటక రాశిలోకి, 23వ తేదీన పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా నాలుగు సార్లు నక్షత్ర సంచారం చేయడంవల్ల కొన్ని రాశులవారు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు.
కన్యా రాశి
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ సమయంలోనే ఉద్యోగాల్లో చేరతారు. కెరీర్ పరంగా, వ్యాపారంలో ఉన్నవారు మంచి విజయాలను సాధిస్తారు. అంతేకాకుండా ఇతర ప్రాజెక్టులద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదిస్తారు. వీరికి అదృష్టం కలిసివస్తుంది. వచ్చిన డబ్బును భవిష్యత్తులో రాబడి వచ్చేలా పెట్టుబడి పెడతారు. దీనికి పెద్దల సలహా తీసుకోవాలి.

మకర రాశి
వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకొని సమాజంలో మంచిపేరు తెచ్చుకుంటారు. దాంపత్య జీవితంలో ఉన్నవారు జీవిత భాగస్వామితో అధిక సమయాన్ని గడుపుతారు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. శుక్రుడు నాలుగుసార్లు నక్షత్రాన్ని మార్చుకోవడంవల్ల వీరికి ప్రత్యేకమైన లాభాలు ఒనగూరుతాయి. ఆస్తులకు సంబంధించి మంచి ప్రయోజనాలున్నాయి. పెద్దల నుంచికానీ, భార్యవైపు నుంచికానీ ఆస్తులు కలిసివచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి.
కర్కాటక రాశి
వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. వచ్చిన డబ్బును కొత్త వ్యాపారాలవైపు మళ్లిస్తారు. సంగీతానికి సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే తిరుగుండదు. అంతేకాకుండా ఈ రాశివారు శుక్రుడి దయతో అనేక లాభాలను పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications