12 ఏళ్ల తర్వాత ఈ రాశులకు బాగా కలిసివస్తోంది

దేవతల గురువైన బృహస్పతి కర్కాటక రాశిలో తిరోగమనం చేస్తాడు. దీనివల్ల హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతున్నప్పటికీ మూడు రాశులకు మాత్రం ఆర్థికంగా అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు ఈ యోగం వల్ల బాగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
అదృష్టం తోడుంటుంది. ఏ పని చేసినా కలిసివస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మికమైన పనులు చేస్తారు. సొంత వ్యాపారం చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంటారు. పనిచేస్తున్న కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తారు. దీనివల్ల గౌరవం కలుగుతుంది. మీకున్న ప్రతిభ చాలా బహుముఖంగా ఉంటుంది. దీనివల్ల మీకు పేరు వస్తుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు బృహస్పతిని పూజించడంవల్ల అనేక పనులు ఆటంకం లేకుండా జరుగుతాయి.

three zodiac signs will get financial benefits after 12 years due to Jupiter retrograde in gemini

తులారాశి
సామాజికంగా ప్రతిష్ట పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వల్ల కార్యాలయంలో సీనియర్లు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. వ్యాపారస్తులకు మంచి రాబడి ఉంది. ఈ రాశివారు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ధార్మికపరమైన పనులు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.

కన్యారాశి
స్టాక్ మార్కెట్ సంబంధిత రంగాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు మీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి, ఇప్పుడు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో హోదా కలుగుతుంది. ప్రజల దృష్టిని వృత్తిపరంగా సులభంగా ఆకర్షించగలుగుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+