ఇక చాలు బాబోయ్ అన్నా... ఈ రాశులకు డబ్బులివ్వడం ఆపని గురుడు, బుధుడు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు రాశి సంచారం చేయడం జరుగుతుంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. ఇలా తమ స్థానాలను గ్రహాలు మారుస్తుండటంవల్ల శుభ పరిణామాలతోపాటు అశుభ పరిణామాలు కూడా ఏర్పడుతుంటాయి. ఇవి సమాజ జీవితంతోపాటు మానవుల వ్యక్తిగత జీవితాలపై కూడా ప్రభావం చూపుతాయి. గ్రహాల రాకుమారుడు బుధుడు, దేవతల గురువైన బృహస్పతి కలిసి శక్తివంతమైన కేంద్ర యోగాన్ని ఏర్పరిచారు. ఇది అన్ని రాశులపై ప్రభావం చూపిస్తోంది. కొన్ని రాశులు మాత్రం పూర్తిస్థాయిలో అదృష్టవంతులవుతున్నాయి.
మేష రాశి
అనుకోని రీతిలో వీరికి ధనం లభిస్తుంది. అలాగే ఆదాయంలో వృద్ధి ఉంది. కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు. స్టాక్ మార్కెట్ సంబంధిత పెట్టుబడులు వీరికి లాభాలనిస్తాయి. ప్రేమలో ఉన్నవారు, దాంపత్య జీవితంలో ఉన్నవారి సమస్యలన్నీ తగ్గిపోతాయి. మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక వాతావరణం పట్ల మొగ్గుచూపుతారు. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళతారు.

తులా రాశి
వైవాహిక జీవితంలో దంపతుల మధ్య అనురాగం వెల్లివిరుస్తుంది. బంధం గట్టిపడుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ప్రతి పనిలోను విజయాన్ని అందుకుంటారు. అదృష్టం కలిసివస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. డబ్బును వృథాగా ఖర్చు చేయకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. జీవితంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ తీరిపోయి సంతోషంగా జీవిస్తారు.
మకర రాశి
కొంతకాలం నుంచి పెండింగ్ లో ఉండి పూర్తికాని పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. వ్యాపారస్తులకు కొత్తగా పెట్టే పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. వ్యాపారస్తులనే కాకుండా ఎవరు కొత్తగా పెట్టుబడి పెట్టినా వారికి లాభాలు తథ్యం. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. కష్టపడి పనిచేసేవారికి మంచి ఫలితాలున్నాయి. చిరకాలంగా ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో అన్ని పనులు పూర్తిచేస్తారు.












Click it and Unblock the Notifications