ఈ రాశులు కూరగాయలు పంచండి... కోటీశ్వరులవుతారు

నవగ్రహాల్లో కీలకమైన గ్రహం బుధుడు. గ్రహాలకు రాకుమారుడిగా భావిస్తారు. తెలివితేటలకు, లెక్కలకు, మాటతీరుకు, స్నేహానికి కారకుడు. వ్యక్తి జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటు ఆ జాతకానికి తిరుగులేదు. అలాగే అశుభ స్థితిలో ఉంటే మాత్రం కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈనెల 15వ తేదీన బుధుడు మీనరాశిలోకి ప్రవేశించాడు.

అయితే ఇక్కడ బుధుడు తిరోగమనదిశలో ప్రయాణం చేస్తాడు. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులవారికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలగడంతోపాటు మంచి ఆరోగ్యం కూడా చేకూరుతోంది. బుధుడివల్ల మంచి జరగాలంటే ఈ రాశులవారు పేదలకు దుస్తులు పంపిణీ చేయడంతోపాటు కూరగాయలను కూడా కొనివ్వడంవల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

three zodiac signs will get financial benefits due to mercury retrograde in pisces

మిథున రాశి
బుధుడు మీనరాశిలో తిరోగమనం చెందడంవల్ల ఈ రాశివారికి భగవంతుడిపై బాగా నమ్మకం కలుగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలగడంతోపాటు ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరిస్తారు. ఆదాయం భారీగా పెరుగుతుంది. అనుకోకుండా డబ్బు వచ్చిపడుతుంది. దీన్ని ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. శుభవార్తలను అందుకుంటారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం దక్కుతుంది.

సింహ రాశి
వ్యాపారాల్లో కొంతకాలం నుంచి ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కొత్తగా భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉమ్మడి భాగస్వామ్యంతో చేసే వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి, రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తికి సంబంధించి కొంతకాలంగా ఉన్న గొడవలన్నీ సద్దుమణుగుతాయి. అన్నిరకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

మేష రాశి
ఈ రాశివారికి ధన ప్రవాహం పెరుగుతుంది. దీనివల్ల ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇల్లంతా నిండిపోతుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి భవిష్యత్తులో మంచి లాభాలను అందుకుంటారు. ఆదాయానికి అనేక మార్గాలు దొరుకుతాయి. ఆటంకాలన్నీ అధిగమించడంతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. కన్న కలలను నిజం చేసుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+