ఈ రాశులకు ధనలక్ష్మీ రాజయోగం
జ్యోతిష్యం ప్రకారం రాహవు, కేతువు నీడ గ్రహాలు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారేందుకు 18 నెలల సమయం తీసుకుంటాయి. శనిదేవుడి తర్వాత అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాలు ఇవి. అందరూ రాహువు, కేతువు అంటే భయపడతారు. కానీ అవి కూడా అనేక మంచి ఫలితాలను రాశి చక్ర గుర్తులకు కలగజేస్తాయనే విషయం తెలియదు. గత నెల 18వ తేదీన కేతువు సింహరాశిలోకి, రాహువు కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఆ మార్పులు చాలా మంచివని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. జులై నెలలో ఈ రెండు గ్రహాలు చేసే సంచారం వల్ల కొన్ని రాశులవారికి సమస్యలు వస్తాయి.. మరికొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి.
కన్యా రాశి
ఈ రాశివారు ఆధ్యాత్మికవైపు మొగ్గుచూపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానంగా జీవితాన్ని అటువైపే తిప్పుతారు. డబ్బుకు అత్యధిక ప్రాధాన్యతనివ్వరు. అయినా వీరి జీవితం చాలా బాగుంటుంది. రాహువు, కేతువు వీరికి అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. విద్యార్థులకు కలిసివచ్చే సమయం ఇది. కష్టపడితే ఫలితం దక్కుతుంది. ఉన్నత విద్యలో రాణిస్తారు. ఈ రాశివారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. చికాకు కలిగించే అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులకు రాహువు, కేతువు సహాయం చేస్తాయి. వారి అనుగ్రహంతో మంచిది, కోరుకున్నది అయిన ఉద్యోగాన్ని పొందుతారు.

మేష రాశి
కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలన్నీ తొలగిపోతాయి. అందరి మధ్య సంబంధాలు బలోపేతమవుతాయి. ఆర్థికంగా ఈ రాశివారికి మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి లభించే మద్దతుతో అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మీ కష్టం మిమ్మల్ని నిలుపుతుంది. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మాత్రం ఇది చాలా మంచి సమయం.












Click it and Unblock the Notifications