శని, బృహస్పతి దయతో ఈ రాశులకు అఖండ సంపద యోగం

నవగ్రహాల్లో అత్యంత కీలక గ్రహాలు బృహస్పతి, శనిదేవుడు. బృహస్పతి దేవతలకు గురువు. జ్ఞానాన్ని ప్రసాదించి, సంపదతోపాటు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఆధ్యాత్మికతవైపు పయనింపచేసి జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయపడతాడు. శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలనిస్తాడు. మంచి పనులు చేస్తే వాటికి రెట్టింపు ఫలితాలను, చెడు చేస్తే అంతకు మూడింతలు ఎక్కువగా చెడు ఫలితాలను ప్రసాదిస్తాడు.

ఇటువంటి శని, బృహస్పతి సంచారం చేయబోతున్నారు. ఈనెల 28వ తేదీన శనిదేవుడు పూర్వాభాద్ర నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి, ఈనెల 10వ తేదీ నుంచి బృహస్పతి రోహిణీ నక్షత్రం నుంచి మార్గశిర నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు. దీనివల్ల కొన్ని రాశులకు ఊహించనిరీతిలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

three zodiac signs will get huge benefits and huge success due to Saturn and venus change their nakshatram

మకర రాశి
సంగీతం, రచన, నటన వంటి కళాత్మక రంగాల్లో ఉన్నవారు, సృజనాత్మకతతో ముడిపడినవారు ఈ సమయంలో అద్భుత విజయాలను నమోదు చేస్తారు. ప్రజలకు సహాయం చేసేందుకు వీరు సొంత డబ్బును మంచినీళ్లల్లా ఖర్చుచేస్తారు. జీవితంలో అపూర్వమైన విజయాన్ని అందుకుంటారు. విజయాలన్నీ వీరిని వెతుక్కుంటూ వస్తాయి. ఊహించనిరీతిలో డబ్బు చేతికి అందుతుంది. కొంతకాలం పనిమీద ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది.

కర్కాటక రాశి
కుటుంబంలో అశాంతి ఉంటుంది. ఈ సమయంలో అది తిరిగి సాధారణ స్థితికి చేరుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న కలతలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. కెరీర్ పరంగా అనేక మార్పులు ఉంటాయి. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని అందుకుంటారు. పడిన శ్రమ వృథా పోదు. జీవితంలో గొప్ప గొప్ప విజయాలను సాధిస్తారు. అందుకు శనిదేవుడు, గురుడు తోడ్పడతారు.

సింహ రాశి
ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుండి కచ్చితంగా పని పూర్తవుతుంది. అన్నివైపుల నుంచి ఆదాయం వస్తుంది. వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోవాలి. పరిశోధనా రంగంలో ఉన్నవారికి ఇది మంచి సమయం. కొత్త ఆవిష్కరణలను కనుగొంటారు. కుటుంబంలో కొంతకాలం నుంచి ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+