సంక్రాంతి తర్వాత వారం రోజుల్లో ఈ రాశులకు అఖండ ధనయోగం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేయడంవల్ల కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. నెలరోజులపాటు ఇదే రాశిలో సూర్యుడు సంచారం చేస్తాడు. 16వ తేదీన సూర్యుడు, కుజుడు 180 డిగ్రీల కోణంలో ఉంటారు. దీనివల్ల ప్రతియుతి యోగం ఏర్పడింది. ఈ యోగంవల్ల కొన్ని రాశులకు అదృష్టం పట్టుకుంటుంది. అన్నిరకాలుగా ఆర్థిక లాభాలను పొందుతారు. వారం రోజులపాటు ఈ యోగం ఉంటుంది. ఈ వారం రోజుల్లో ఏయే రాశులకు ప్రతి యుతి యోగంవల్ల కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
ధనస్సు రాశి
ఈ రాశివారికి ఈ సమయంలో మంచి లాభాలున్నాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు బాగా కలిసివస్తుంది. సంపాదన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. అభివృద్ధి కూడా చాలా వేగంగా ఉంటుంది. అన్నిరకాలుగా మంచి పనులు చేస్తారు. వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో ఈ రాశివారికి రాబడి ఎక్కువ. భవిష్యత్తులో ఆదాయంపై వీటిని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది.

కన్యారాశి
గతంలో కంటే ఈ రాశివారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కొత్తగా అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు ఇతర మార్గాల ద్వారా ఆదాయం కలుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి.
తులారాశి
ఈ సమయంలో వీరికి అదృష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. దాంపత్య జీవితం ఆనందంగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. డబ్బు సంపాదన రెండింతలు అవుతుంది. వాటిని పొదుపు చేస్తేనే భవిష్యత్తులో కలిసివస్తుంది. విజయాలను సాధిస్తారు. కొత్త వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచన చేస్తారు.












Click it and Unblock the Notifications