ఈ రోజు నుంచి ఈ రాశులు పట్టిందల్లా బంగారమే!
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. అయితే కొన్ని కొన్ని అరుదైన సందర్భాల్లో ఒకే రాశిలో కొన్ని గ్రహాలు ఒకేసారి సంచారం చేస్తాయి. దీనివల్ల మంచి శుభ యోగాలు ఏర్పడతాయి. గ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడు, ఛాయా గ్రహమైన కేతువు, గ్రహాల రాకుమారుడైన బుధుడు సింహరాశిలో ఒకేసారి సంచారం చేస్తున్నారు. దీనివల్ల శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఇది చాలా శుభ యోగం.
తులా రాశి
పెట్టుబడులు పెడతారు. వాటి నుంచి భారీ లాభాలు ఆర్జిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు, ఇప్పుడు పెడుతున్న పెట్టుబడులు కూడా మంచి లాభాలను తీసుకురావడంతోపాటు సంపద పెంచుతాయి. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ వంటి రంగాల నుంచి కూడా డబ్బును సంపాదిస్తారు. చాలా సంతోషంగా ఉండటంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి విహార యాత్రలకు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి. కెరీర్ పరంగా ఊహించనిరీతిలో మార్పులు పెరుగుతాయి. సంగీతం, రచన, క్రియేటివిటీ రంగాల్లో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. పిల్లలతో శుభవార్తలు వినడంతోపాటు అందరూ సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి
వీరికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. నలుగురిని మేనేజ్ చేయగలుగుతారు. త్రిగ్రాహి యోగం వీరికి మంచి అవకాశాలను కల్పిస్తుంది. అంతేకాదు.. విజయాలను కూడా అందిస్తుంది. పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు బాగా కలిసిరానుంది. కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్థులకు బాధ్యత పెరగడంతోపాటు వేతనం పెరుగుతుంది. కెరీర్ పరంగా మంచిగా రాణిస్తారు.
కర్కాటక రాశి
ఇతరులను మాటలతో ఆకట్టుకుంటారు. మీ ఆలోచనలతో ఏకీభవించేలా చేస్తారు. పనిమీదే ఎక్కువ దృష్టిపెడతారు. మీడియా, కమ్యూనికేషన్స్, మార్కెటింగ్, సింగర్స్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ రాశివారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. వారిపై వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఏ పనినైనా సమర్థవంతంగా పూర్తిచేయగులుగుతారు.












Click it and Unblock the Notifications