ఈ నెల 16 నుంచి ఈ రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంటోంది
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో ఈనెల 16వ తేదీకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆరోజు చంద్రుడు, నీడ గ్రహమైన రాహువు సంయోగం జరపబోతున్నాయి. ఈ రెండు గ్రహాల సంయోగం అనేది చాలా అరుదుగా జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అదేరోజు చంద్రుడు కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. రాహువు కూడా అక్కడే సంచారదశలో ఉంది. దీనివల్ల ఏర్పడే వక్తివంతమైన సంయోగంవల్ల కొన్ని రాశులవారికి అదృష్టం బాగా పట్టుకుంటోంది. వీరికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
చంద్రుడు, రాహువు కలవడం అనేది ఈ రాశివారికి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. ఉద్యోగాల్లో ఉన్నవారికి వారి పై అధికారుల నుంచి, సీనియర్ల నుంచి సహకారం లభించి మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు వారి ప్రశంసలకు పాత్రులవుతారు. ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. డబ్బులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. వ్యాపారాల్లో ఉన్నవారు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్నారు. వారి కోరిక నెరవేరే సమయం ఇదే.

కన్యా రాశి
కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. మంచి స్థాయికి వెళతారు. ఒక రకంగా ఈ రాశివారికి ఈ సమయం చాలా సానుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో భాగస్వామ్యంతో ఉన్నవారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులు కొంతకాలం ఎదురుచూడాలి. విదేశాలకు వెళ్లాలంటే కష్టపడాల్సి ఉంటుంది. అంత సులువుగా పరిణామాలు లేవు.
మేషరాశి
ఉద్యోగస్థులు తమ కార్యాలయాల్లో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. చంద్రుడు, రాహువు వల్ల వీరికి అనేక లాభాలు కలగనున్నాయి. పదోన్నతులు వస్తాయి.. వేతనం పెరుగుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి విశేషమైన ప్రయోజనాలను ఈ సమయంలోనే అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలసి విహార యాత్రలకు వెళతారు. దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి.












Click it and Unblock the Notifications