ఆరుద్ర నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశుల ఇంట్లోకి ధనలక్ష్మీదేవి
ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరుడి జన్మ నక్షత్రం. దీన్ని రాహువు పరిపాలిస్తాడు. రాక్షసుల గురువు, నవగ్రహాల్లో కీలక గ్రహమైన శుక్రుడు జులై 26న మిథున రాశిలోకి ప్రవేశించాడు. ఈనెల ఒకటో తేదీన ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేశాడు. శుక్రుడు ఆరుద్రలోకి ప్రవేశించడంవల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. సంపదకు కారకుడయ్యే శుక్రుడి వల్ల ఊహించని లాభాలను పొందనున్న రాశుల వివరాలను తెలుసుకుందాం.
సింహరాశి
వ్యాపారాలన్నీ లాభసాటిగా మారతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి డబ్బులు ఈ సమయంలో భారీగా వస్తాయి. నిర్ణయం తీసుకునేముందు అది తప్పుడు నిర్ణయం కాకుండా ఎంతో ఆలోచించి తీసుకోవాలి. శక్తి సామర్థ్యాలు భారీగా పెరుగుతాయి. ఒంటరిగా ఉన్న వ్యక్తులు దాంపత్య జీవితంలోకి ప్రవేశిస్తారు. డబ్బున్నవారి కుటుంబాలతో వివాహాలు కుదురుతాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వారి నుంచి అనేక ప్రయోజనాలను ఈ రాశులవారు పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులున్నాయి.

తులారాశి
సమాజంలో ఊహించనిరీతిలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలను కుటుంబ సభ్యులతో కలిసి చేస్తారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. ఉద్యోగస్థులకు మంచి లాభాలున్నాయి. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. ఎటువంటి సమస్యలైనా ఈ సమయంలోనే తొలగిపోతాయి. ఆగస్టు నెలలో ఈ రాశివారు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు.
మిథున రాశి
వ్యాపారం చేస్తున్నవారి వ్యాపారాలు బాగా మెరుగుపడతాయి. వాక్చాతుర్యంతో, మంచి మాటలతో ఎదుటివారిని ఆకట్టుకొని మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. పెళ్లికానివారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. వృత్తిపరమైన జీవితంలో ఆర్థిక లాభాలున్నాయి.












Click it and Unblock the Notifications