2025 ప్రారంభంలోనే లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులపై సంపదల వర్షం
జ్యోతిష్యం ప్రకారం బుధుడు, శుక్రుడు శుభగ్రహాలు. తెలివితేటలకు బుధుడు, సంతోషానికి, సంపదకు కారకుడు శుక్రుడు. ఈ రెండూ కలిస్తే అంతా శుభం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల కలయికవల్లే లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతోంది. డబ్బు కోసం ప్రయత్నిస్తున్నవారు ఈ సమయంలోనే విజయం సాధిస్తారు.
ఈ యోగంవల్ల కొన్ని రాశులవారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వారి సంపద రోజురోజుకు పెరుగుతుంది. అనేక ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయి. వచ్చే ఏడాది జనవరి 28వ తేదీన శుక్రుడు మీనరాశిలోకి, ఫిబ్రవరి 27వ తేదీన బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాయి. మీనరాశిలో ఈ రెండు గ్రహాలు కలవడంవల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతోంది. ఇది 69 రోజులు ఉంటుంది. రాశులపై సంపదల వర్షం కురుస్తుంది. ఏయే రాశులకు ఏ విధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మీన రాశి
వ్యాపారవేత్తలకు మంచి లాభాలున్నాయి. వ్యక్తిగతంగా అంతా అనుకూలంగా జరుగుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బాగుంటుంది. ఆర్థికంగా చాలా లాభదాయకత ఉంటుంది. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారి లగ్నస్థానంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడింది. కొత్తగా ఇంటిని కొనుగోలు చేయాలన్నా, కొత్తగా కారును కొనుగోలు చేయాలనుకున్నా ఇది చాలా మంచి సమయం. ఈ రాశివారికి లక్ష్మీనారాయణ యోగంవల్ల ఆర్థికంగా అంతా మంచే జరగనుంది.

మేష రాశి
డబ్బుకు ఎటువంటి కొరత ఈ రాశివారికి ఏర్పడదు. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. భూమి నుంచి, ఇతర వ్యాపారాల నుంచి మంచి లాభాలను అందుకుంటారు. సమాజంలో హోదా పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి, ఉద్యోగం మారడానికి ఇది మంచి సమయం. తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది.
మిథున రాశి
విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ సమయంలో అంతా కలిసివస్తుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. వృత్తి జీవితంలో, ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది. అలాగే వేతనం పెరుగుతుంది. కోరుకుంటున్న ఉద్యోగాన్ని కూడా పొందగలుగుతారు. యోగబలంతో వేసే అడుగుల్లో విజయాన్ని అందుకుంటారు.
పనితీరుకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు.












Click it and Unblock the Notifications