కార్తీకంలో గజకేసరి యోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం

మాసాల్లో కార్తీక మాసంను మించిన పవిత్రమైన మాసం ఉండదు. అటువంటి నెలలో ఏ పూజ చేసినా, దానం చేసినా, వ్రతం చేసినా.. ఏ మంచి పనిచేసినా వంద రెట్లు అధిక ఫలాన్నిస్తుంది. హిందువులకు ఎంతో పవిత్రమైన ఈ మాసంలోనే గజకేసరి యోగం ఏర్పడుతోంది. ఇది జాతకుల వ్యక్తిగత జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. యోగం కూడా ఈరోజే ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారు జీవితంలో ఆర్థికంగా స్థిరపడతారు. ఇకనుంచి వారు లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు. గజకేసరి యోగంవల్ల లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.

మిథున రాశి
కొంతకాలంలో కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి తీర్పు అనుకూలగా వస్తుంది. ఆస్తులు సొంతమవుతాయి. తర్వాత స్థిరాస్తి రంగంలో రాణించడంతోపాటు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబ సభ్యులంతా అనుబంధంతో వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామి నుంచి లభించిన మద్దతుతో వ్యాపారాన్ని మరింత పెద్దది చేస్తారు.

three zodiac signs will get more money and more profits due to gajakesari yogam in november month

కుంభరాశి
ఈ రాశివారు ఎప్పటినుంచో కల కంటున్న సొంత ఇంటి కల సాకారమవుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఈ సమయంలో లభిస్తుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడి లాభసాటిగా మారతాయి. విందు కార్యక్రమాల్లో, వినోదాల్లో పాల్గొని జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. అదే సమయంలో జీవితంపట్ల అప్రమత్తత అవసరం. కుటుంబ సభ్యులందరి నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించడంతో ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు.

కర్కాటకరాశి
భార్య తరఫు నుంచి ఆస్తి వచ్చి కలుస్తుంది. స్నేహితులకు అప్పులు ఇస్తుంటారు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు వారు పనిచేసేచోట పై అధికారుల నుంచి ప్రశంసలు లభించడంతోపాటు కార్యాలయంలో మంచిపేరు లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+