ఈ రాశులకు సమయం వచ్చింది.. మిమ్మల్ని ఆపేవారే లేరు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాయి. అలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తుంటాయి. రాశి సంచారం చేసినప్పుడు ఎటువంటి ఫలితాలనిస్తాయో, నక్షత్ర సంచారం చేసినప్పుడు కూడా అటువంటి ఫలితాలనే ఇస్తాయి. గ్రహాలకు రాజైన సూర్యుడు తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. ఈ నెల 18న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు. 31వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల అన్ని రాశులపై ప్రభావం పడుతున్నప్పటికీ కొన్ని రాశులకు మాత్రం విశేషమైన ప్రయోజనాలను కలగనున్నట్లు జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
వృశ్చిక రాశి
ఉద్యోగులకు వారి కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల నుంచి మద్దతు లభించడంతోపాటు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో అదృష్టం విశేషంగా కలిసివస్తుంది. రుణ సమస్యలన్నీ తీరిపోవడంతో ప్రశాంతంగా జీవిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. వచ్చే డబ్బును భవిష్యత్తు కోసం మంచి మంచి సంస్థల్లో పెట్టుబడి పెట్టాలి.

ధనస్సు రాశి
సూర్యుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించినంతకాలం వీరికి అనేక లాభాలు కలుగుతుంటాయి. అన్ని విషయాల్లోను అదృష్టం కలిసివస్తుంది. స్నేహితులతో కలిసి జీవితాన్ని ఆస్వాదిస్తారు. కొంతకాలం నుంచి మీకు ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళతారు. ఆర్థికంగా గతంకంటే మెరుగుపడతారు.
మేష రాశి
వీరికి అదృష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్థులకు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం దక్కుతుంది. దాంతోపాటు ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. అదృష్టం తోడుండటంవల్ల ఏ పనినైనా చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతారు. డబ్బులు దుబారా ఖర్చు చేయడంవల్ల ఇబ్బందులకు గురవుతారు.












Click it and Unblock the Notifications