జాతకంలో సూర్యుడి బలం పెరగాలంటే.. ఆరోగ్యం, ఐశ్వర్యం కావాలంటే ఆదివారం ఇలా చెయ్యండి

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు గ్రహాలన్నింటిలోనూ ప్రధానమైనటువంటి గ్రహం. గ్రహాల రారాజుగా చెప్పే సూర్యుడు జాతకంలో అనుకూలమైన స్థానంలో ఉంటే, బలంగా ఉంటే అన్ని పనులు సజావుగా సాగుతాయి. సూర్యుడు అన్నింటా మీకు విజయాన్ని కలిగిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాడు.

జాతకంలో సూర్యుడు బలోపేతం కావాలంటే ఇలా చెయ్యండి
అయితే జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడాల్సి వస్తుందని ముందే చెప్పుకున్నాం. ఇక సూర్యుడిని జాతకంలో బలోపేతం చేయడానికి చేయవలసిన రెమిడీస్ గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. జాతకంలో సూర్యుడు బలోపేతం కావాలంటే సూర్య భగవానుడికి ఇష్టమైన వాటిని దానం చేయడం మంచిది అలా దానం చేస్తే శ్రేయస్సు కలుగుతుంది.
సమస్యలు తొలగిపోతాయి.

To strengthen sun in horoscope to get health and wealth do these remedies on Sunday

ఆదివారం ఇవి దానం చెయ్యండి.. సూర్యుడికి ఇవి సమర్పించండి
ఆదివారం రోజు రాగి, గోధుమలు, పప్పులు, బెల్లం మరియు ఎర్రచందనం మొదలైనవి దానం చేస్తే జాతకంలో సూర్యుడు బలోపేతం అవుతాడు . దీనివల్ల ఆదాయం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. జాతకంలో సూర్యుడు బలోపేతం కావాలంటే రాగి పాత్రలో గంగాజలాన్ని తీసుకొని ఎరుపు రంగు పూలు, ఎర్ర చందనం, అక్షంతలు కలిపి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఇలా చేస్తే సూర్యుడు జాతకంలో బలపడతాడు.

ఆదివారం ఈ పని చెయ్యండి
సూర్యుడికి ఆదివారం ప్రీతికరమైన రోజు కాబట్టి ఆదివారం నాడు ఉపవాసం చేస్తే, సూర్య భగవానుని స్మరిస్తూ మంత్రాలను జపిస్తే కూడా జాతకంలో సూర్యుడు బలపడతాయి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తి అవతారాలను పూజిస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు. ఆదివారం రోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల జాతకంలో సూర్యుడు బలపడతాడు.

సూర్యుడు బలోపేతం కావాలంటే ఇవి కూడా చెయ్యండి
ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం కూడా జాతకంలో సూర్యుని బలోపేతం చేస్తుంది. ఓం సూర్యాయ నమః, ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమః వంటి మంత్రాలను జపిస్తే సూర్యుడు జాతకంలో బలపడతాడు, నల్ల కుక్కలకు చపాతీ తినిపించడం వల్ల కూడా జాతకంలో సూర్యుడు బలపడతాడు. అంతేకాదు ఆదివారం రోజు నల్ల ఆవులకు రొట్టెలను తినిపిస్తే, చీమలకు చక్కెర పెడితే, చేపలకు పిండి ముద్దలు వేస్తే జాతకంలో సూర్యభగవానుడు బలోపేతం అవుతాడు.

ఆదివారం ఇవి అస్సలే తినకండి
ఆదివారం నాడు చందన తిలకం ధరించి ఇంటి నుండి బయటకు వెళ్లి వస్తే చెడిపోయిన పనులు కూడా మళ్లీ చక్కదిద్దబడతాయి. సూర్య కటాక్షం ఉంటుంది. ఆదివారం ఉప్పు తినకుండా ఉంటే, మద్యం, మాంసం తినకుండా నిష్టగా సూర్యుడిని పూజిస్తే జాతకంలో సూర్యుడు బలపడతాడు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+