Today horoscope: నేడు వీరికి జాక్ పాట్ .. తేల్చేసిన గ్రహ యోగాలు!
జనవరి 21, 2026 నాడు నవగ్రహాలు వివిధ రాశులలో సంచారం చేయడం వల్ల అనేక రాశులకు అనుకూలమైన ఫలితాలను సూచిస్తున్నాయి. నేడు సూర్యుడు మకర రాశిలో సంచారం చేస్తుండగా, చంద్రుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. మకర రాశిలో సూర్యుడు మరియు బుధుడు కలసి ఉండటంతో బుధ ఆదిత్య యోగం ఏర్పడి శుభ ఫలితాలను ఇస్తుంది.
గ్రహయోగాలతో ద్వాదశ రాశుల వారికి ఫలితాలిలా
గురు వృషభ రాశిలో ఉండటం ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడుతున్నాడు. శని మీనరాశిలో సంచారం చేయడం వల్ల బాధ్యతలు పెరుగుతాయి. నేడు వివిధ గ్రహాల సంచారంతోపాటు యోగాల కారణంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.

మేషరాశి
ఈ రోజు మేష రాశివారికి ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నందున ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు చేసే వారికి నేడు మిశ్రమంగా ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశివారికి నేడు ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఏ పని చేసిన నేడు కలిసి వస్తుంది.
మిధున రాశి
మిథున రాశి వారు నేడు పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయినప్పటికీ మిధున రాశి వారికి చివరకు అనుకూల ఫలితాలు అందుకుంటారు. మాటల్లో సంయమనం పాటించాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆస్తి సంబంధిత విషయాల్లో పురోగతి ఉంటుంది. కర్కాటక రాశి వారు ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల ఫలితాలను చూస్తారు.
సింహరాశి
సింహ రాశివారికి ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
కన్య రాశి
కన్య రాశివారికి విద్య, పోటీ పరీక్షల విషయంలో నేడు చాలా అనుకూలత ఉంటుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈరోజు వీరికి కలిసి వస్తుంది
తులారాశి
తుల రాశివారు ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేడు ఆర్థిక విషయాలలో ముఖ్యంగా ఆలోచన అవసరం. దాంపత్య జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారు నేడు కష్టపడి చేసిన పనులకు తగిన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఏ పని చేసిన కాస్త ఆలోచించి పని చేయాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి శుక్ర ప్రభావంతో ఆనందం, సృజనాత్మకత పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి జాతకులు అన్నింట సానుకూల ఫలితాలను పొందుతారు. లగ్జరీ లను అనుభవిస్తారు.
మకర రాశి
మకర రాశివారికి బుధ ఆదిత్య యోగం కారణంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. ఇది వీరికి మంచి సమయం.
కుంభరాశి
కుంభ రాశివారికి ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ స్నేహితుల సహకారంతో సమస్యలు పరిష్కారమవుతాయి. కుంభరాశి జాతకులు నేడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలను పొందుతారు.
మీనరాశి
మీన రాశివారికి చంద్రుడు, శని ప్రభావంతో భావోద్వేగాలు పెరుగుతాయి. మీనరాశి జాతకులు ముఖ్యమైన నిర్ణయాల్లో ఆలోచనతో ముందుకు వెళ్లడం మంచిది.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications