today rasi phalalu: నేడు వీరు శుభవార్తలు వినటం తధ్యం.. గ్రహాల మహిమ!

నేడు గురువారం నవంబర్ 27 వ తేదీ ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి. ఏ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉంటారు? ఏ రాశి వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది? అయితే నేడు వీరికి శుభవార్తలు వినటం తధ్యం. ఆ వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు వృత్తిపరంగా అనుకూలత ఉంటుంది. తోటివారితో సంతోషంగా గడుపుతారు. చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయి. మిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి.

today rasi phalalu know the lucky and unlucky zoidac signs with 27th november horoscope of 12 zodiac signs

వృషభ రాశి
వృషభ రాశి జాతకులు ప్రారంభించే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిధున రాశి
మిధున రాశి వారు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది. రుణ బాధలు తగ్గుతాయి. అయితే కీలక అంశాలలో పెద్దలను సంప్రదించడం మంచిది.

కర్కాటక రాశి
ప్రారంభించే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అందరినీ కలుపుకొని వెళ్లడం మంచిది.

సింహరాశి
సింహరాశి వారు శుభవార్తలు వింటారు. అది వీరికి సంతోషాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన పురోగతి ఉంటుంది.

కన్యారాశి
ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు.ఈ సమయంలో ముఖ్యమైన కొనుగోలును చేస్తారు.

తులారాశి
తులా రాశి వారికి నేడు మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త.

వృశ్చిక రాశి
నేడు వీరికి మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీకు ధైర్యాన్నిస్తుంది. ఎవరికైనా సాయం చేసేవారికి గొప్ప ఫలితాలు వస్తాయి.

ధనుస్సు రాశి
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటి వారి ద్వారా సహాయాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బులు అందుతుంది.

మకర రాశి
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని వృధా చేయకూడదు.

కుంభరాశి
నేడు కుంభ రాశి వారికి శుభకరం. ఈరోజు ఏ పని చేసినా కలిసి వస్తుంది. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలు ఉంటాయి.

మీన రాశి
మీన రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనుల విషయంలో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసరమైన భయాందోళనకు తావివ్వకూడదు.

disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+