ఈ రాశులవారు శుభవార్తలు వింటారు.. మీరున్నారా!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గ్రహ సంచారం కారణంగానే ప్రతిరోజు వివిధ రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం మన మేషరాశి నుండి కన్యా రాశి వరకు వివిధ రాశుల వారికి నేడు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం.
మేష రాశి
మేషరాశి జాతకులు ఈరోజు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త పనులు ప్రారంభించే ముందు మంచి చెడులను బేరీజు వేసుకుని ముందుకు సాగాలి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మేషరాశి జాతకులు ఆచితూచి వ్యవహరించాలి. కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి, దైవ బలమే మిమ్మల్ని రక్షిస్తుంది. నేడు విష్ణు సందర్శనం సూచించబడింది.

వృషభ రాశి
వృషభరాశి జాతకులు నేడు కొత్త పనులను ప్రారంభిస్తారు. సమస్యగా అనిపించిన పనులను నిర్లక్ష్యం చెయ్యకుండా ఉండాలి. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు శుభప్రదంగా సాగుతాయి. ఇష్టదేవతను ఆరాధిస్తే మంచిదని సలహా.
మిధునరాశి
మిధునరాశి జాతకులు నేడు బంధువులతో చాలా సంతోషంగా గడుపుతారు. మిధునరాశి జాతకులకు మీరు పని చేసే రంగాలు అనుకూలంగా ఉంటాయి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ ఆరాధన మంచిదని సూచన.
కర్కాటక రాశి
నేడు కర్కాటక రాశి వారికి కలిసొస్తుంది. విందులు, వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకున్నది అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషానికి కారణం అవుతుంది. దైవారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
సింహరాశి
సింహరాశి జాతకులకు నేడు మిశ్రమంగా ఉంటుంది. కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే నేడు శ్రమ అధికంగా ఉంటుంది. కానీ సమయానికి నిద్రాహారాలు చెయ్యాలని సూచన. నేడు సింహరాశి వారికి ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృధా ఖర్చులు ఉన్నాయి జాగ్రత్త. గోసేవ చెయ్యాలని సలహా.
కన్యా రాశి
కన్యారాశి వారికి నేడు లాభదాయకంగా ఉంటుంది. నేడు వీరు శుభవార్తలు వింటారు.ఉన్నతాధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. నేడు బంధువులతో సంతోషంగా గడుపుతారు. అనవసరపు ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి, నేడు శివుడిని ఆరాధించటం మంచిది
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications