రేపు శనిదేవుడి జయంతి.. ఈ ఒక్క పూజ చేయండి చాలు

శనిదేవుడు కర్మ ఫలితాన్ని బట్టి ఫలాలను అనుగ్రహిస్తాడు. ప్రతిఒక్కరూ ఏదో ఒక దశలో శని దశను కచ్చితంగా ఎదుర్కొంటారు. ఈ సమయంలో సాడేసతితోపాటు వని ధైయతో బాధపడాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 6వ తేదీ గురువారం శని జయంతి. ప్రతి ఏడాది జ్యేష్టమాసంలో అమావాస్య రోజు దీన్ని జరుపుకుంటారు. ఆరోజు శనికి ప్రత్యేక పూజలు చేస్తే ఎంతో మంచిది. ఉదయాన్నే తలస్నానం చేసి శనిదేవుడి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి.

శనికి నల్లనువ్వులను సమర్పించాలి
నల్లనువ్వులను శనికి సమర్పించాలి. నల్లగుడ్డతోపాటు బంతిపూలతో పూజించాలి. దీనివల్ల శని ధైయా, సడేసతి నుంచి విముక్తి కలుగుతుంది. ఆరోజు 108 సార్లు ప్రదక్షిణ చేయడంతోపాటు ఓం ప్రాణ్‌ ప్రీం ప్రాణ్‌ సః శనైశ్చరాయనమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శని అనుగ్రహం ఉంటే జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. శనిచాలీసాను కూడా చదవాలి. ఆయనకు ఇష్టమైన ప్రసాదాన్ని సమర్పించడంవల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.'

tomorrow is shani jayanthi do this pooja

శని ముందు తల వంచకూడదు
ప్రజల మీద శని దేవుడి దృష్టి పడితే వారి జీవితంలో సమస్యలు మొదలవుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీంతో శని దేవుడి దృష్టి ఇంటి మీద.. కుటుంబ సభ్యుల మీద పడకుండా శని దేవుడి విగ్రహాలను ఇంట్లో ఉంచి ఆరాధించరు. అధిక సంఖ్యలో ప్రజలు శని దేవుడి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు చేస్తుంటారు. అయితే అలాంటి పూజలను దేవాలయాలలో మాత్రమే చేయాలి. పొరపాటున కూడా ఇంట్లో ఆరాధించకూడదు. ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ తిరగడంవల్ల కూడా సమస్యలు పరిష్కారమవుతాయని, అలాగే నవగ్రహాలకు అభిషేకం చేయడం కూడా చాలా మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. దేవాలయానికి వెళ్లినప్పుడు భగవంతుడి ముందు తలవంచి నమస్కారం చేస్తుంటారు. అయితే శనిదేవుడికి మాత్రం ఎప్పుడూ పొరపాటున కూడా తలవంచి నమస్కరించకూడదు. దేవుడివైపు వీపు చూపించేలా ఆలయం నుంచి బయటకు రాకూడదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+