మార్చి నుండి త్రిగ్రాహి యోగం ప్రకటించింది వీరికి సంపదల సునామీ!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీ సంవత్సరం గ్రహాల సంచారం, సంయోగం ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. 2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాల మార్పు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. గ్రహాల మార్పు, గ్రహాల సంయోగం కారణంగా శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి . అటువంటి యోగాలలో త్రిగ్రాహి యోగం ఒకటి.
త్రిగ్రాహి యోగం
మీన రాశిలో శని, బుధుడు మరియు సూర్యుడి కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. మీనరాశిలో ఏర్పడుతున్న ఈ త్రిగ్రాహి యోగం ఈ గ్రహాల కలయికతో ముప్పై ఏళ్ళ తర్వాత జరుగుతుంది. ఈ త్రిగ్రాహి యోగం కారణంగా కొన్ని రాశులవారు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. త్రిగ్రాహి యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభం కలగబోతుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
మీనరాశిలో ఏర్పడే త్రిగ్రాహి యోగం కారణంగా మిధున రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. మిధున రాశిలో పదవ ఇంట్లో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. త్రిగ్రాహి యోగం కారణంగా వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలను పొందుతారు. ఇది మిధున రాశి వారికి అదృష్ట సమయం.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి త్రిగ్రాహి యోగం కారణంగా ప్రయోజనాలు చేకూరుతాయి. ధనుస్సు రాశిలో నాలుగవ ఇంట్లో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ధనస్సు రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గృహ నిర్మాణం చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది. ఈ సమయంలో మీ విశ్వాసం బాగా పెరుగుతుంది. ఇది మీకు శుభాలను ఇచ్చే కాలం.
మీన రాశి
మీనరాశిలో ఏర్పడే త్రిగ్రాహి యోగం మీనరాశి జాతకులకు శుభాలను తెచ్చి పెడుతుంది. మీనరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో మీన రాశి వారి సామాజిక పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు ప్రయోజనాలను ఇస్తాయి. మీ వ్యక్తిత్వం వికసిస్తుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications