డిసెంబరులో ప్రపంచాన్ని శాసించే విధంగా మారిపోతున్న ఈ రాశుల జీవితాలు
నవ గ్రహాల్లో కీలకమైన గ్రహం శుక్రుడు. సంపదకు కారకుడయ్యే శుక్రుడు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాడు. ఇలా సంచారం చేసే సమయంలో కొన్ని రాశులకు సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు. మరికొన్ని రాశులవారికి అశుభ ఫలితాలు కలుగుతుంటాయి. అది వారి వారి కర్మలను బట్టి ఆధారపడివుంటుంది. వచ్చే నెల రెండో తేదీ నుంచి 28వ తేదీ వరకు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. దీనివల్ల వృషభరాశి, మేష రాశివారికి విపరీతమైన లాభాలు కలుగుతున్నాయి. వీరి సొంతింటి కల అతి త్వరలోనే నెరవేరనుంది. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. ఈ రెండు రాశులకు శుక్రుడివల్ల ఏ విధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మేషరాశి
ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. మంచితనం ఎక్కువగా ఉండకూడదు. అది చేటు చేస్తుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకునే విషయం విఫలమవుతారు. విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఇతరుల నుంచి మెప్పు ఆశించకుండా పనులు చేయండి. దంత సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఖర్చులు పెరుగుతాయి. తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీకుండే మొండి స్వభావంతో విజయపథంలో సాగుతారు. వాక్చాతుర్యంతో పనులను పూర్తిచేస్తారు. చేస్తున్న పనిలో ఎదురయ్యే సమస్యలన్నీ తాత్కాలికంగా మారతాయి. ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మాటతీరు మృదువుగా మార్చుకొని ప్రపంచాన్ని జయించేంతటి ఓర్పును సొంతం చేసుకుంటారు.

వృషభ రాశి
దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. పనులన్నింటినీ విజయవంతంగా పూర్తిచేస్తారు. పిల్లల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో దెబ్బతింటారు. కుటుంబంలో, బయట అందరితో కలిసిపోయే గుణం మీకుంది. మాటలు మనోహరంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఇతరుల నుంచి సాయాన్ని ఆశించరు. మీదగ్గర ఉన్న డబ్బులో కొంత భాగాన్ని ఇతరుల కోసం ఖర్చు చేస్తారు. ఉద్యోగాన్ని మార్చాలనే నిర్ణయం తీసుకోవడంవల్ల అది కలిసివస్తుంది. మంచి అవకాశాలు తలుపు తడతాయి. దంపతులు ప్రేమ, నమ్మకంతో జీవిస్తారు. ఈ సమయంలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది.












Click it and Unblock the Notifications